Sreeleela : ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Hero Sreeleela) బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తొందరపాటు నిర్ణయం తీసుకుందా?, తెలుగులో ఆమెకు వరుసగా భారీ అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా బాలీవుడ్ వైపు తొంగి చూసే ప్రయత్నం ఇంత తొందరగా చేయాల్సింది కాదని అనిపిస్తుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. బాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) తో ‘ఆషికీ 3’ తో పాటు, సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరో గా నటిస్తున్న మొదటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాల కారణంగా ఆమె టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా, నవీన్ పోలిశెట్టి తో మరో సినిమా వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే కెరీర్ ని రిస్క్ లో పెట్టి బాలీవుడ్ కి వెళ్ళింది అనొచ్చు. రిస్క్ లో పడే పరిస్థితులు రావని అంతా అనుకున్నారు కానీ, రీసెంట్ గా జరిగిన ఒక పరిణామం చూస్తే రిస్క్ లో పడిందనే చెప్పొచ్చు.
Also Read : ఇక జీవితంలో మళ్ళీ అలాంటి పొరపాటు చేయను..ఇదే చివరిసారి అంటూ శ్రీలీల ఎమోషనల్ కామెంట్స్!
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈమె కార్తీక్ ఆర్యన్ తో కలిసి ‘పతి పత్ని ఔర్ వో 2’ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమెతో ఒప్పందం చేసుకొని నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరి నిమిషం లో శ్రీలీల ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా టాండన్(Rasha Tandon) ని ఎంచుకున్నారు. ఇలా చేయడం పై టాలీవుడ్ ఆడియన్స్ తో బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫైర్ అయ్యారు. బాలీవుడ్ లో నెపోటిజం రూల్ చేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ అయ్యే అదృష్టం ఉన్న శ్రీలీల అనవసరంగా బాలీవుడ్ కి వెళ్లి ఇలా పరువు తీసుకోవడం ఎందుకు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేమిటంటే గత కొంతకాలం గా ఆమె కార్తీక్ ఆర్యన్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ సోషల్ మీడియా లో ఒక చర్చ పెద్ద ఎత్తున సాగింది. నేషనల్ మీడియా లో కూడా దీనిపై కథనాలు ప్రచారం చేసారు. ఇలాంటి సందర్భంలో కార్తీక్ ఆర్యన్ తో మరో సినిమా వెంటనే చేస్తే, కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో ఉందని అందరూ అనుకుంటారని, అందుకే శ్రీలీల తల్లి సలహా మేరకు శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే శ్రీలీల హీరోయిన్ గా నటించిన రీసెంట్ తెలుగు చిత్రం ‘రాబిన్ హుడ్’ ఇటీవలే గ్రాండ్ గా విడుదలై డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read : 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో సినిమాలో చెయ్యను అంటూ శ్రీలీల సంచలన కామెంట్స్!