Aarya 2 Re Release : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుంతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ట్రెండ్ లో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) టాప్ లో నిలుస్తూ వచ్చారు. ఓపెనింగ్ రికార్డ్స్, ఫుల్ రన్ రికార్డ్స్ ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్యనే ఉన్నాయి. కానీ రీసెంట్ గానే ప్రభాస్(Rebel Star Prabhas) ‘సలార్’ చిత్రం తో ఈ ట్రెండ్ లోకి అడుగుపెట్టాడు. ఎలాంటి ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పకపోయినప్పటికీ, ఫుల్ రన్ లో 4 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టి బలమైన వసూళ్లు రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిల్చింది. అలాగే ఎన్టీఆర్(Junior NTR) సింహాద్రి తో , రామ్ చరణ్(Global Star Ram Charan) ఆరెంజ్ చిత్రం తో తమ సత్తా చాటారు. ఇప్పుడు అల్లు అర్జున్(Icon Star Allu Arjun) వంతు వంచింది. ఆయన హీరో గా నటించిన పాత చిత్రం ‘ఆర్య 2′(Aarya 2 Release) ఏప్రిల్ 7న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 5న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు.
Also Read : పాన్ వరల్డ్ షేక్ అయ్యే మల్టీస్టారర్ ని ఫిక్స్ చేసిన అల్లు అర్జున్!
కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ని బుక్ మై షో యాప్ లో మొదలు పెట్టారు. దీనికి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బుకింగ్స్ ప్రారంభించిన రెండు నిమిషాల్లోనే సంధ్య 35 MM థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది. అంతే కాకుండా ఈ చిత్రానికి గంటకు మూడు వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లో మొత్తం 10 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే, పది షోస్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ రేంజ్ ట్రెండ్ ఉంటే కచ్చితంగా టాలీవుడ్ రీ రిలీజ్ చిత్రాలలో ఆల్ టైం టాప్ 5 లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఆర్య 2 కి పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే పాటలు అద్భుతంగా ఉండే రీ రిలీజ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కుంభస్థలాలు బద్దలు కొడుతున్నాయి.
ఆరెంజ్ చిత్రానికి ఇది మనం చూసాము. ఇక ఆర్య 2 చిత్రంలోని పాటలు ఆరోజుల్లో ఏ రేంజ్ సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో మన అందరికీ తెలిసిందే. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ప్రతీ హీరో అభిమాని థియేటర్స్ లో చొక్కాలు చింపుకొని డ్యాన్స్ వేసే రేంజ్ పాటలు అవి. ఆందుకే ఈ సినిమా కచ్చితంగా టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ చిత్రం మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లతో ఆల్ టైం టాప్ 1 స్థానం లో నిల్చింది. ఆర్య 2 కి ఇదే రేంజ్ ఊపు కొనసాగితే 5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 15 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
Also Read : ‘హరి హర వీరమల్లు’ సెన్సార్ డేట్ వచ్చేసింది..ఇక విడుదల లాంఛనమే!