Kingdom
Kingdom : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. స్టార్ హీరోలు ఉన్న బిజీ వల్ల కావచ్చు, లేదంటే ఆ హీరోలకు కథలు నచ్చకపోయి ఉండచ్చు, దర్శకులకు మార్కెట్ పెద్దగా ఉండకపోవడం వల్ల కానీ స్టార్ హీరోలు మంచి కథలను రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు. మరి ఏది ఏమైనా కూడా సినిమాని జడ్జ్ చేయలేకపోవడం వల్ల ఆయా హీరోల కెరియర్లకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి…
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో వస్తున్న కింగ్ డమ్ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. అయితే ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే తను పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. నిజానికి ‘మళ్లీ రావా’ సినిమాతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో నాని హీరోగా ‘జెర్సీ’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దాంతో జెర్సీ సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కించారు. ఇక అక్కడ మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అయింది. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్(Ram Charan) లాంటి స్టార్ హీరోకి కింగ్ డమ్ (Kingdom) కథ చెప్పి ఒప్పించిన గౌతమ్ తిన్ననూరి అతనితో సినిమా చేయలేకపోవడం నిజంగా ఆయన బ్యాడ్ లక్ అనే చెప్పాలి. కింగ్ డమ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నుంచి నిన్న ఒక రిజర్ అయితే రిలీజ్ అయింది.
ఈ టీజర్ అద్భుతంగా ఉండటమే కాకుండా ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా దానికి నెక్స్ట్ లెవెల్లో సెట్ అయింది. ఇక భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. అనేది చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సినిమా మేధావులు సైతం ఈ టీజర్ ను చూసిన తర్వాత ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ఇక ఇలాంటి సందర్భంలో మొదట ఈ సినిమానే గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో చేయాలనుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అయితే పట్టలెక్కలేదు. నిజానికి గౌతమ్ తిన్ననూరి మంచి మేకర్ అయితే మొదట్లో రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టాడు. హిందీలో జెర్సీ (Jersy) సినిమా ఫ్లాప్ అవ్వడంతో సుకుమార్ (Sukumar) బుచ్చిబాబు(Buchhi Babu) ను తీసుకొచ్చి రామ్ చరణ్ కి ఒక కథ అయితే వినిపించాడు.
అదే సమయంలో హిందీలో జెర్సీ ఫ్లాప్ అవ్వడం బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతో రామ్ చరణ్ బుచ్చిబాబుకి ఓకే చెప్పి ఈ కథను పక్కన పెట్టేసాడు. దాంతో గౌతమ్ విజయ్ దేవరకొండ తో సినిమాని అనౌన్స్ చేశాడు. మరి మొత్తానికైతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనేది ఆ టీజర్ ని చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. రామ్ చరణ్ చేసి ఉంటే ఈ సినిమాకు మరింత రీచ్ అయితే దక్కేదని మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉండడం విశేషం…