Prabhas , Ram Charan
Prabhas and Ram Charan : సినిమా ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరో కి ఒక్కొక్క మైల్ రాయి సినిమా అయితే ఉంటుంది. వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసిన సినిమాలు వాళ్ళ లైఫ్ ని మలుపు తిప్పిన సినిమాలు అంటూ ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆ సినిమాకి ముందు వాటి తర్వాత అనే రేంజ్ లో సినిమాలను చేసిన మన హీరోలు వాళ్ళ కెరియర్ ను మలుపు తిప్పిన సినిమాలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేరు. మరి ఇలాంటి సందర్భంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్(Ram Charan) సైతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన మగధీర(Magadheera) సినిమా అతన్ని స్టార్ హీరోను చేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో రామ్ చరణ్ స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. ఇక రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను కొట్టిన హీరోగా ఒక మంచి రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు…ఇక ఇదిలా ఉంటే రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ సైతం బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపునైతే తెచ్చుకున్నాడు.
ఇక అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకొని యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించాడమే కాకుండా వారందరికి ఒక విజువల్ ట్రీట్ ని కూడా అందించాడు.
అప్పటివరకు ప్రభాస్ ని చూడని ప్రతి ఒక్కరు ఆ సినిమాతో అతనికి అభిమానులుగా మారిపోయారు… ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత మోస్ట్ పవర్ఫుల్ సినిమా అని చెప్పాలి… ఇక వీళ్ళ మాదిరిగానే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కి కూడా కింగ్ డమ్ (Kongdom) సినిమా ఒక అద్భుతాన్ని తీసుకొచ్చి పెట్టబోతుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ని కనక మనం చూసినట్లయితే ఒక హాలీవుడ్ ఫ్లేవర్ తో సినిమా తెరకెక్కబోతుంది. అలాగే తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు పోషించనటువంటి ఒక అద్భుతమైన పాత్రలో మనకు కనిపించబోతున్నాడనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక రామ్ చరణ్ కి మగధీర…ప్రభాస్ కి బాహుబలి లాగా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కూడా ఒక గొప్ప గుర్తింపుని తీసుకొచ్చి అతన్ని స్టార్ హీరోల లిస్టులోకి చేర్చబోతుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది…