Ram Charan , Sukumar
Ram Charan and Sukumar : ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం ఫ్లాప్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) చాలా జాగ్రత్తగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. కేవలం కాంబినేషన్స్ వైపు పరుగులు తీయకుండా, కంటెంట్ ని నమ్ముకొని ఆయన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న బుచ్చి బాబు(Buchibabu Sana) కి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కథ లో అంత బలం ఉందని ఆయన బలంగా నమ్మాడు. తన కెరీర్ లో ‘రంగస్థలం’ ని మించిన సినిమా అవుతుందని అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం రెండు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ సమయంలో రామ్ చరణ్ కి తీవ్రమైన వైరల్ ఫీవర్ ఉన్నప్పటికీ, ఇంత ఆర్టిస్టుల డేట్స్ వృధా కాకూడనే ఉద్దేశ్యంతో షూటింగ్ లో పాల్గొని షెడ్యూల్ ని పూర్తి చేసాడు.
ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ సమయంలో రామ్ చరణ్ అబుదాబి లో డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) తో స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడు. ముందుగా ఈ సినిమా పీరియడ్ జానర్ లో తెరకెక్కుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ చిత్రం టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్’ తరహా యాక్షన్ చిత్రమని తెలుస్తుంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి అంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం టామ్ క్రూజ్. ఈ సిరీస్ లో ఆయన ప్రాణాలకు తెగించి, ఎన్నో పోరాట సన్నివేశాలు చేసాడు కాబట్టి ఈ సిరీస్ పై అంతటి క్రేజ్ ఏర్పడింది. కానీ ఇండియా లో టామ్ క్రూజ్ మినహా ఏ హీరో చేసిన ఈ జానర్ పై అంతటి క్రేజ్ రావడం కష్టమే. ఉదాహారానికి సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’, హ్రితిక్ రోషన్(Hritik Roshan) నటించిన ‘ఫైటర్’ వంటి సినిమాలు ఈ జానర్ కి సంబంధించిన సినిమాలే.
వీటికి టాక్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. దీని అర్థం ఈ జానర్ సినిమాలకు మన ఇండియన్ ఆడియన్స్ లో క్రేజ్ తగ్గిపోయింది అని. కానీ ఇప్పుడు రామ్ చరణ్, సుకుమార్ కాంబినషన్ లో రాబోతున్న సినిమా ఈ జానర్ లో ఉండబోతుంది అనే విషయం తెలుసుకొని అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. తమ హీరో కి పుష్ప ని మించిన క్యారక్టర్ ని డిజైన్ చేస్తాడేమో అని సుకుమార్ నుండి అభిమానులు ఆశిస్తే, ఇప్పుడిప్పుడే కనుమరుగు అవుతున్న స్పై యాక్షన్ జానర్ ని ఎంచుకోవడం ఏమిటని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఇప్పుడు మనం వింటున్న ఈ వార్త రాబోయే రోజుల్లో ఎంత వరకు నిజం అవుతుంది అనేది.