Sukumar: ఇండస్ట్రీలో టాలీవుడ్ ట్రయల్ బ్లేజర్‌గా పేరుసంపాదించాడు దర్శకుడు సుకుమార్. ఈయన ఇప్పటికే ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఆర్య’ నుంచి రీసెంట్ గా వచ్చిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘పుష్ప’ సినిమా వరకు అతని ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలను సాధించాడు అనడంలో సందేహం లేదు. అంతేనా.. అత్యంత నైపుణ్యం కలిగిన దర్శకుడిగా సుకుమార్ కీర్తి దేశ సరిహద్దులు దాటింది. ఇక అతికొద్ది మంది సూపర్-టాలెంటెడ్ పాన్-ఇండియా దర్శకులలో ఒకరిగా నిలిచారు సుకుమార్. ‘పుష్ప ది రూల్,’సినిమాను భారీ బడ్టెట్ తో రూపొందించి..హిట్ కొట్టాడు. స్టార్ హీరో అల్లుఅర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ సాధించింది. అయితే ఈయన శిష్యులు కూడా సుకుమార్ రేంజ్ లో సక్సెస్ అవుతున్నారు. మరి ఆ శిష్యులు ఎవరు? ఏం చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీకాంత్ ఓదెల..
కొత్త టాలెంట్, ఫ్రెష్ ఫేస్ లతో సినిమా ప్రపంచం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఇలా అప్ కమింగ్ డైరెక్టర్ల జాబితాలో తాజాగా చేరారు శ్రీకాంత్ ఓదెల. ఈయన దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమా ‘దసరా.’ ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఓదెల అసాధారణమైన సినిమా నైపుణ్యం, ఆయన డైరెక్షన్ చిత్ర పరిశ్రమలోనే ఆయన పేరు మారుమోగేలా చేసాయి. ఈయన సుకుమార్ శిష్యుడిగా ఉండి..ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించడం గురువుకు కూడా సంతోషమే అంటున్నారు సుకుమార్ అభిమానులు.
ఇక శ్రీకాంత్ ఓదెల తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త కాదు. గతంలో కూడా దర్శకుడు సుకుమార్‌తో కలిసి రెండు బిగ్గెస్ట్ హిట్స్ చేశాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాల హిట్ లో తనదైన పాత్ర పోషించాడు. ఈ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా దసరా సినిమాకు దర్శకత్వం వహించి గురువుకు తగ్గ శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు ఓదెల.
బుచ్చిబాబు..
కరోనా సమయంలో ప్రతి పరిశ్రమ క్లోజ్ అయింది. ఈ సమయంలో వినోదాన్ని పంచే చిత్ర పరిశ్రమ కూడా మూత పడింది. ఇక 2021లో, మొదటి లాక్‌డౌన్ తర్వాత వచ్చిన బిగెస్ట్ హిట్ ‘ఉప్పెన`. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. అయితే ఈ బిగ్గెస్ట్ హిట్ తో బుచ్చిబాబు కూడా గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. బుచ్చిబాబు ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నాడు. ఇది పాన్-ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ సుకుమార్ నుంచి నేర్చుకున్న పాఠాలు, ఆయన నైపుణ్యమే అనడంలో సందేహం లేదు. ఇక బుచ్చిబాబు గతంలోనే సుకుమార్ తన గురువు అని, ఆయనకు రుణపడి ఉంటానని తెలిపారు.
పలనాటి సూర్య ప్రతాప్..
పలనాటి సూర్య ప్రతాప్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మరో హిట్ దర్శకుడు. ఈయన కెరీర్‌లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అతను ఒకప్పుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. సూర్య ప్రతాప్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు..అతనికి ట్రేడ్‌లో మెళకువలు నేర్చుకోవడానికి, డైరెక్షన్ లో సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి సహాయపడింది అనడంలో సందేహం లేదు. ఇక ఈయన 2015లో “కుమారి 21F” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ నటించి మెప్పించారు. ఇక సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది.
2021 లో,ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా “18 పేజీలు” దీనికి నిర్మాణం అల్లు అరవింద్ అందించారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించి సినిమా హిట్ కొట్టేలా చేశారు.ఇక ఈ సినిమా కూడా సూర్య ప్రతాప్ ఖాతాలో మరో హిట్ ను సంపాదించి పెట్టింది.
జక్క హరిప్రసాద్..
ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న మరో దర్శకుడు జక్కా హరి ప్రసాద్ . ‘ప్లేబ్యాక్’ సినిమాతో తన సత్తా చాటాడు. హరి ప్రసాద్ హిట్ లు కొట్టడానికి సుకుమార్ మరో కారణం అంటారు. ఈయన దగ్గర నేర్చుకున్న స్కిల్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఇక హరి ప్రసాద్ తన గురువు నుంచి డైరెక్షన్ లో మెలుకువలు నేర్చుకొని తన సినిమాలు హిట్ కొట్టే స్థాయికి తీసుకెళ్లాడని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో మరెన్నో అద్భుతాలు సృష్టించగల సత్తా ఉన్న గ్రేట్ డైరెక్టర్ హరి. ఈయన డైరెక్షన్ లో మరెన్నో సినిమాలు రావాలని.. అవి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.
వర్మా రెడ్డి..
ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న మరో డైరెక్టర్ వేమారెడ్డి. ఈయన తన సొంత దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక సుకుమార్‌తో కలిసి పనిచేయడం వల్ల వేమారెడ్డి కూడా సినిమాకు దర్శకత్వం వహించడానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకున్నారు అని తెలుస్తోంది.ఇక బ్లాక్ బస్టర్ హిట్స్ 1: నేనొక్కడినే, పుష్ప: ది రైజ్‌తో సహా సుకుమార్ అనేక ప్రాజెక్ట్‌లలో పనిచేశాడు. కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వేమారెడ్డి సుకుమార్ తను సొంతంగా దర్శకత్వం వహించాలి అని ప్లాన్ చేస్తున్నారు.దీంతో ఈయన ఒక షాట్ ఫిలిమ్ తో రాబోతున్నారట.