https://oktelugu.com/

Hanuman: అయోధ్య రామమందిరానికి ‘హనుమాన్’ చిత్రయూనిట్ భారీ విరాళం..! ఎన్ని కోట్లు అంటే

హనుమాన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ అయోధ్య రామమందిరానికి విరాళం ఇవ్వనుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే సినిమా ప్రతి టికెట్ పై రూ.5 చొప్పున విరాళంగా ఇవ్వనుందని ఆయన ప్రకటించారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 23, 2024 / 04:59 PM IST
    Follow us on

    Hanuman: అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృమైన సంగతి తెలిసిందే. రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇదే సమయంలో తెలుగు చిత్రపరిశ్రమలో విడుదలైన హనుమాన్ చిత్రం యావత్ దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.

    హనుమాన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ అయోధ్య రామమందిరానికి విరాళం ఇవ్వనుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే సినిమా ప్రతి టికెట్ పై రూ.5 చొప్పున విరాళంగా ఇవ్వనుందని ఆయన ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అయోధ్య రామ మందిరానికి ఒక్కో టికెట్ నుంచి రూ.5 చొప్పున సేకరించారు. ఇందులో భాగంగా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టికెట్లకు గానూ రూ.14,85,810 చెక్కును అందించారు. అంతకముందే హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక చిత్ర బృందం తాజాగా 53,28,211 టికెట్లను విక్రయించిన నేపథ్యంలో రూ.2,66,41,055 రామ మందిరానికి అందించారు.

    డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ నటుడు తేజ సజ్జా నటించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో కథనాయకగా అమృతా అయ్యర్ నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.. వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రలను పోషించారు. దాదాపు రూ.60 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తీశారు. ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తో నడుస్తోంది.