Ayodhya Ram Mandir: విద్వేష వ్యాఖ్యలు చేసుకునే స్థాయి నుంచి.. పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయి నుంచి.. ఇష్టానుసారంగా మాట్లాడే స్థాయి నుంచి.. పరమత సహనం అనే స్థాయికి ఎదుగుతున్నది భారతదేశం. విశ్వ గురువుగా ఎదుగుతున్నది. సోమవారం అయోధ్యలోని రామాలయాన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని సంఘాలు పక్కన పెడితే చాలా వరకు ముస్లింలు దానిని స్వాగతించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు ఆ వేడుకను చూసామని చెబుతున్నారు. మసీదులకు సంబంధించిన కొంతమంది మౌలలీలు అయోధ్య వెళ్లి మరి రాముడు ఆలయ ప్రారంభాన్ని, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను దగ్గరుండి చూశారు. రామ జన్మభూమి ట్రస్ట్ వీరికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు కల్పించింది. అక్కడి రామాలయాన్ని చూసి ముస్లింలు సంతృప్తి కూడా వ్యక్తం చేశారు.. కొంతమంది ముస్లింలు అయితే హైదరాబాదు లోని పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో మిఠాయిలు కూడా పంచారు. కొన్నిచోట్ల అన్నదానాలు చేశారు. ఇంకొన్నిచోట్ల హిందువులతో కలిసి అక్షింతలు పంపిణీ చేశారు. ఇక ఇలాంటి దృశ్యాలు భారత్లో పరమత సహనం ఉంది అని చెప్పడానికి ప్రబల సంకేతాలని బిజెపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పరమత సహనం పెరిగిపోయిందని చెప్పడానికి బలం చేకూర్చే సంఘటన ఒకటి జరిగింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో సోమవారం రాముడి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. బాల రాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు.. అయితే ఈ విగ్రహ ప్రతిష్టాత్మ సమయంలో ఓ ముస్లిం గర్భిణి ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో తన భార్య ప్రసవించడం.. పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో..ఆమె భర్త పుట్టిన బిడ్డకు రామ్ రహీం అని పేరు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ ఆసుపత్రిలో సదరు గర్భిణీ ప్రసవం నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. సరిగ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో ప్రసవించింది. అయితే ఆ బిడ్డకు ఆమె భర్త రామ్ రహీం అని పేరు పెట్టాడు. హిందూ ముస్లింల మధ్య ఐక్యత ఉండటానికి.. మతాలు వేరైనా మనుషుల మంతా ఒక్కటే అని స్ఫూర్తి ప్రదర్శించేలా తన బిడ్డకు ఆ పేరు పెట్టానని ఆ తండ్రి వ్యాఖ్యానించాడు.
రాముడు విగ్రహ ప్రతిష్టాపన సమయంలోనే తనకు మనవడు జన్మించాడని, రెండు మతాలవారు ఐక్యంగా ఉండేలా రామ్ రహీం అని పేరు కూడా పెట్టుకున్నాడని ఆ శిశువు బామ్మ హుస్నా భాను వ్యాఖ్యానించింది.. తన కుమారుడికి పండంటి బాబు జన్మించాడని, అతడికి రామ్ రహీం అని పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొంది. కాగా ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మీడియాకు చేరింది. మీడియా కూడా దీనికి సంబంధించి ప్రాప్తంగా వార్తలు ప్రసారం చేయడంతో సోషల్ మీడియాకు కూడా ఎక్కింది. దీంతో ఒక్కసారిగా రాం రహిమ్ అనే పేరు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం న్యూస్ చానల్స్ లో చూసి చాలామంది తన మనవడిని చూడటానికి చూస్తున్నాను హుస్నా భాను మురిసిపోతోంది.