Chandrababu Naidu
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం( Alliance government ) పాలనను పరుగులు పెట్టించాలని భావిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో వడివడిగా అడుగులు వేస్తోంది. అటు చంద్రబాబు ప్రపంచ దిగ్గజ బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సేవలను ఎలా వినియోగించుకోవాలని అంశంపై ఆయనతో చర్చించారు. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పనా వంటి కీలక రంగాలలో ఈ ఫౌండేషన్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
Also Read : ఏపీలో డబుల్ డెక్కర్ జోష్.. చంద్రబాబు ట్వీట్!
* రెండు రంగాలకు ప్రాధాన్యం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు( artificial intelligence) ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్,ప్రిడేక్టివ్ ఎనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆయా రంగాల్లో పురోగించడంపై బిల్ గేట్స్ తో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే కేవలం సంప్రదింపులు కాకుండా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రారంభించారు చంద్రబాబు. వీలైనంత త్వరగా బిల్ గేట్స్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. గతంలో ఇదే బిల్ గేట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏపీ వైపు చూసేలా చేశారు చంద్రబాబు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితికి తీసుకురావాలని భావిస్తున్నారు.
* వారంతా కీలక వ్యక్తులే
కాగా బిల్ గేట్స్ తో( Bill Gates) చర్చల అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా రంగాలకు సంబంధించి ప్రభుత్వంలో నలుగురు సలహాదారులను నియమించారు. ఇస్రో మాజీ చైర్మన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల, డి ఆర్ డి ఓ మాజీ చీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, ఏపీ ఫోరెక్స్ లేబరేటరీ మాజీ డైరెక్టర్ కెపిసి గాంధీ ఈ జాబితాలో ఉన్నారు. వీరి సేవలను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు.
* నలుగురికీ కీలక బాధ్యతలు
ఫోరెనిక్స్ సైన్స్( forenix science ) సలహాదారుడుగా కెపిసి గాంధీ, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారుడిగా సతీష్ రెడ్డి, స్పేస్ టెక్నాలజీ సలహాదారుడుగా సోమనాథ్, హస్తకళల అభివృద్ధి శాఖ సలహాదారుడిగా సుచిత్ర ఎల్లా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వీరందరూ క్యాబినెట్ హోదాలో కొనసాగునున్నారు.