Director Sukumar :
‘పుష్ప’ సిరీస్ తో డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి తో సమానమైన క్రేజ్ ని సంపాదించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక హీరో క్యారక్టర్ ని వెండితెర పై అద్భుతంగా చూపించాలన్నా, హీరో నుండి పీక్ రేంజ్ పెర్ఫార్మన్స్ ని రాబట్టుకోవాలన్నా సుకుమార్ తర్వాతనే ఏ డైరెక్టర్ అయినా. అందుకే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనీ సూపర్ స్టార్స్ సైతం ఆశ పడుతుంటారు. కానీ సుకుమార్ ఒక సినిమాని చెక్కడం లో రాజమౌళి ని మించిన జక్కన్న అనడంలో ఎలాంటి అతిశయం లేదు. ఒక సన్నివేశానికి ఆయన మూడు నుండి నాలుగు వెర్షన్స్ రాసుకుంటాడు. వాటిని తెరకెక్కిస్తాడు, ఆ తర్వాత ఆయన వాటి నుండి బెస్ట్ షాట్స్ ని ఏంచుంటాడు, అందుకే ఆయన అంత ఆలస్యం అవుతుంటాయి. 2021 లో విడుదలైన పుష్ప తర్వాత ‘పార్ట్ 2’ రావడానికి దాదాపుగా మూడేళ్లు పట్టింది.
Also Read : మహేష్ బాబు,రణబీర్ కపూర్ కాంబినేషన్ లో మిస్ అయిన చిత్రం అదేనా..? చేసుంటే ఆరోజుల్లోనే 1000 కోట్లు వచ్చేది!
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఒక సినిమాని పూర్తి చేయడానికి ఏ రేంజ్ సమయం తీసుకుంటాడు అనేది. ఇదంతా పక్కన పెడితే పుష్ప 2 తర్వాత ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రామ్ చరణ్(Global Star Ram Charan) ని అబుదాబిలో కలిసి మూడు స్టోరీ లైన్స్ వినిపించాడట. రామ్ చరణ్ కి ఒక స్టోరీ లైన్ బాగా నచ్చిందట, దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అయితే సెట్స్ మీదకు వెళ్ళేలోపు సుకుమార్ మరో ప్రాజెక్ట్ ని కూడా సెట్ చేసుకున్నాడట. రీసెంట్ గానే ముంబై లో ఆయన ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించాడట.
ఇది కూడా పుష్ప సినిమా లాగానే యాంటీ హీరో క్యారక్టర్ ఉన్న సినిమా అట. షారుఖ్ ఖాన్(Sharukh Khan) కి కూడా తెగ నచ్చేసింది. రామ్ చరణ్ మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే షారుఖ్ ఖాన్ తో సినిమాని ప్రారంభించబోతున్నాడు సుకుమార్. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆయన ఫుల్ బిజీ గా మారిపోయింది. ఇదంతా పక్కన పెడితే భవిష్యత్తులో ఆయన ‘పుష్ప 3’ చిత్రం కచ్చితంగా చేస్తాడని తెలుస్తుంది. 2028 వ సంవత్సరం లో ఆ సినిమాని మొదలు పెడుతామని ఆ చిత్ర నిర్మాతలు నిన్న ఒక ప్రెస్ మీట్ లో తెలిపిన సంగతి తెలిసిందే. కానీ సుకుమార్ కమిట్ అయిన ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే పుష్ప 3 ఉంటుంది. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ తో కూడా ఆయన ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఇది ఎప్పుడు మొదలు అవుతుందో ఎవరికీ తెలియదు.
Also Read : రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో హీరోయిన్స్ గా సమంత, రష్మిక..ప్లానింగ్ మాములుగా లేదుగా!