Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని ముందుగా మేకర్స్ ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆ టైం వరకు పూర్తి అవ్వకపోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర ను ఎవ్వరూ పోషిస్తున్నారు అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ముఖ్యంగా మొదటి పార్ట్ లో పుష్ప మీద రివెంజ్ తీర్చుకోడానికి మంగళం శీను, జాలి రెడ్డి, బన్వర్ సింగ్ షెకావత్ లాంటి పాత్రలు ఎదురుచూస్తూ ఉంటాయి. కాబట్టి పుష్ప 2 సినిమాలో వీళ్ళ పాత్రలు చాలా కీలకంగా మారబోతున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఎవరు చేస్తున్నారనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. వీళ్ళ ముగ్గురిలో ఎవరు మెయిన్ గా మారబోతున్నారు ఇక వీళ్ళు ముగ్గురు కాకుండా మరొక విలన్ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే కోణం లో ఇప్పుడు అందరిలో అనుమానాలైతే ఉన్నాయి. మరి ఇక దానికి తగ్గట్టుగానే సుకుమార్ కూడా తనదైన రీతిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అనేది సినిమా క్లైమాక్స్ వరకు ఎవరికీ తెలియదని అది అత్యంత అదిరిపోయే ట్విస్ట్ గా మారబోతుందంటూ సుకుమార్ తన సన్నిహితుల దగ్గర ఈ విషయాలను చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే సుకుమార్ సినిమా టీమ్ కి కూడా తన స్క్రిప్ట్ ని లీక్ చేయకుండా ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేసి పుష్ప 2 క్లైమాక్స్ ను ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు. కానీ సినిమా చూసే ప్రేక్షకులకు మాత్రం ఒక హై ఫీల్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక పుష్ప మొదటి పార్టు తెలుగు ప్రేక్షకులను అంత బాగా అలరించలేదనేది మాత్రం వాస్తవం… అయినప్పటికీ ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక దాదాపు 500 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను. తెరకెక్కిస్తున్నారు. ఇక 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందనే నమ్మకంతో మేకర్స్ అయితే ఉన్నారు. ఇక సుకుమార్ కూడా దానికి అనుగుణంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి సుకుమార్ నమ్ముతున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది…