https://oktelugu.com/

Atlee: అల్లు అర్జున్ ను కాదనుకొని అట్లీ రాంగ్ స్టెప్ వేశాడా..? ఇప్పుడు సల్మాన్ ఖాన్ పెట్టే కండిషన్స్ ను తట్టుకోలేకపోతున్నాడా..?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరూ సౌత్ ఇండస్ట్రీ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా సౌత్ సినిమా దర్శకుల వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 12, 2024 / 11:05 AM IST

    Atlee

    Follow us on

    Atlee: సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను అందుకున్న దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలను చేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్లకున్న స్టార్ డమ్ ను పెంచుకోవాలంటే స్టార్ హీరోలతో సినిమా చేస్తేనే అది వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో వాళ్లు స్టార్ హీరోల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ కూడా ఇంతకుముందు షారుక్ ఖాన్ తో ‘జవాన్ ‘ అనే సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అట్లీ రెమ్యూనరేషన్ హెవీగా అడగడం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయింది. దాంతో అట్లీ వెంటనే ఇదే ప్రాజెక్ట్ ని బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన దగ్గరికి ఈ కథను తీసుకెళ్లాడు.

    ఇక సల్మాన్ ఖాన్ ఈ కథను విని సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఇక దాంతో పాటుగా ప్రస్తుతం ఆయన మురుగదాస్ డైరెక్షన్ లో ‘సికిందర్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే అట్లీ సినిమాను పట్టాలెక్కించే పనిలో సల్మాన్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ అట్లీ రాసుకున్న స్క్రిప్ట్ లో చాలావరకు డౌట్లు అడుగుతూ కొన్ని సీన్స్ ని చేంజ్ చేయమని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది.

    దాని వల్ల అట్లీ కొంతవరకు ఇబ్బంది పడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే అట్లీ కమర్షియల్ సినిమాని చాలా లిమిటెడ్ బడ్జెట్లో తెరకెక్కించి భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో దిట్ట…అలాగే ఆయన ఏదైతే రాసుకుంటాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం సల్మాన్ ఖాన్ కొన్ని చేంజేస్ చేయడం అతనికి నచ్చడం లేదట. ఇక దాంతో ఆయన అల్లు అర్జున్ తో ఈ సినిమా చేసిన బాగుండేది అంటూ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక మొత్తానికైతే ఎలాగైనా సరే అట్లీ ఈ ప్రాజెక్ట్ ను సల్మాన్ ఖాన్ తో చేసి భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ సల్మాన్ ఖాన్ దానికి సహకరిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే అట్లీ స్టార్ డైరెక్టర్ గా మరోసారి తన సత్తా చాటుకున్నాడు అవుతాడు…