Sukumar really liked that Balayya movie: నందమూరి నట సింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకునేలా ఉంటాయి… ఇక ఇటు హీరోగా, అటు పొలిటిషన్ గా పలు రకాల బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న బాలయ్య బాబు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకుంటున్నాడు. వరుసగా నాలుగు విజయాలతో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. సీనియర్ హీరోలెవరు కూడా తన దరిదాపుల్లో కూడా లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక బాలయ్య చేసిన సినిమాలు అన్నీ కూడా మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి… బాలయ్య చేసిన సినిమాల్లో డైరెక్టర్ సుకుమార్ కి నచ్చిన సినిమా ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
ఆర్య (Arya) సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన సుకుమార్ (Sukumar) మొదటి సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. అప్పటినుంచి ఆయన వరుస సినిమాలు చేస్తూ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఇక పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో భారీ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు…
సుకుమార్ లాంటి ఇంటలిజెంట్ డైరెక్టర్ కి బాలయ్య బాబు లాంటి మాస్ హీరో చేసిన సినిమాల్లో సమరసింహారెడ్డి (Samarasimha Reddy) సినిమా అంటే చాలా ఇష్టమని ఆయనే ఒక సందర్భంలో తెలియజేశారు. ఇక వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నప్పటికి బాలయ్య చేసే సినిమాలకి సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి అసలు సెట్ అవ్వదు అని మరి కొంతమంది భావిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావాలని మాత్రం బాలయ్య బాబు అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది…ఒక వేళ వీళ్ళ కాంబో కనక సెట్ అయితే సుకుమార్ అయిన బాలయ్య జానర్లోకి వెళ్ళాలి…లేదంటే బాలయ్య అయిన సుకుమార్ టైప్ ఆఫ్ స్టైలిష్ సినిమాలో చేయాలి…ఏది జరిగిన కూడా బాగానే ఉంటుంది…