Srileela Interviewed Pawan Kalyan: ఒక పక్క ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది సమయం అయ్యింది. ఈ ఏడాది లో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాలనలో ఫుల్ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకు కాస్త సమయం దొరకడంతో సినిమాలకు తన సమయాన్ని కేటాయించాడు. ఆయన చేతిలో ప్రస్తుతం మూడు లాంగ్ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu),’ఓజీ'(They Call Him OG) చిత్రాలను పూర్తి చేసాడు. ఇప్పుడు ఆయన రీసెంట్ గానే ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. నిన్న ఈ విషయాన్నీ మేకర్స్ ఒక స్టైలిష్ వీడియో ని ట్విట్టర్ లో అప్లోడ్ చేసి అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ వీడియో లోని పవన్ కళ్యాణ్ లుక్స్ చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా కొనసాగనుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న విడుదల చేసిన ఒక వీడియో లో ఎవరైనా ఒక చిన్న షాట్ ని గమనించారా?, ఈ షాట్ లో పవన్ కళ్యాణ్ తో శ్రీలీల ఉంటుంది. దీనిని బాగా గమనిస్తే ఇది ఒక ఇంటర్వ్యూ (podcast) లాగా అనిపిస్తుంది. శ్రీలీల ఈ చిత్రం లో ఒక మీడియా ఛానల్ కి జర్నలిస్ట్ గా వ్యవహరిస్తుందని ఈ చిన్న షాట్ ని చూస్తే అర్థం అవుతుంది. నగరం లో ఎంతో పాపులారిటీ ని సంపాదించిన ACP ఉస్తాద్ భగత్ సింగ్ ని ఇంటర్వ్యూ చేసే ఈ సన్నివేశాన్ని మొన్న చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ ఒక్క షాట్ తో అభిమానులకు ఈ చిత్రం రీమేక్ కాదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఈ చిత్రాన్ని ప్రకటించిన రోజు నుండి తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన విజయ్ ‘తేరి’ చిత్రానికి రీమేక్ అంటూ ప్రచారం చేశారు.
అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఈ పూర్తిగా కొత్త స్క్రిప్ట్ అట,హరీష్ శంకర్ ఈ స్క్రిప్ట్ కోసం రెండేళ్ల సమయం తీసుకున్నాడట. అన్ని అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో కూడా ఉన్నారు మేకర్స్. అదే కనుక జరిగితే ఈ ఏడాది లో పవన్ కళ్యాణ్ నుండి మూడు సినిమాలు విడుదల అయ్యినట్టు లెక్క. ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే నెల లో విడుదల అవుతుంది, ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25 న రాబోతుంది. ఈ రెండు సినిమాల తర్వాత మరో రెండు నెలలో గ్యాప్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటే అభిమానులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
Iss baar sirf Aandhi nahin, toofan hain
POWER STAR @PawanKalyan joins the sets of #UstaadBhagatSingh ❤
Shoot in progress. Stay tuned for more updates.
@harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #UjwalKulkarni @MythriOfficial… pic.twitter.com/817bJiof5M— Ustaad Bhagat Singh (@UBSTheFilm) June 11, 2025