Vishwak Sen: ‘లైలా’, ‘ఫంకీ’ వంటి వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటిస్తున్న చిత్రం ‘కల్ట్’. ఈ సినిమాలో ఆయన కేవలం హీరో గా నటించడమే కాదు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా వహిస్తున్నాడట. తనతో ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ ని అందించాడు. నేడు సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ని ప్రసాద్ మల్టీ ప్లెక్స్, లార్జ్ స్క్రీన్ లో జరపబోతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే ఈ చిత్రం ద్వారా విశ్వక్ సేన్ ఏకంగా 40 మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు అట.
ఇలా టాలీవుడ్ హిస్టరీ లో ఒక సినిమా ద్వారా ఇంతమంది కొత్త నటీనటులను పరిచయం చేయడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఆ క్రెడిట్ కచ్చితంగా విశ్వక్ సేన్ కి చెందుతుంది. ఆ 40 మంది కి ఆయన ఎలాంటి క్యారెక్టర్స్ రాసాడు, వాళ్ళ నుండి ఎలాంటి నటన రాబట్టుకున్నాడు అనేది చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. వియాత్నం నగరం లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకొని, నేటి తరం యువతని ఆకట్టుకునేలా కొన్ని సినిమాటిక్ లిబర్టీ ఎలిమెంట్స్ ని జోడించి ఈ చిత్రాన్ని విశ్వక్ సేన్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి KGF ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నది. ఈ చిత్రాన్ని కేవలం పాన్ ఇండియా కి మాత్రమే పరిమితం చేయకుండా ఇంగ్లీష్, జపనీస్ మరియు స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసున్నాడట విశ్వక్ సేన్.
ఈ చిత్రానికి సందీప్ కాకర్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. విశ్వక్ సేన్ గతంలో ‘ఫలక్ నూమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడవ సారి దర్శకత్వం వహిస్తూ, హ్యాట్రిక్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ఆయన కెరీర్ కి ఎంతో అవసరం. ఎందుకంటే కెరీర్ లో వరుసగా మూడు భారీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. మార్కెట్ కి పెద్ద డెంట్ పడింది. ఇలాంటి సమయం లో ఈ సినిమా ఫ్లాప్ అయితే విశ్వక్ సేన్ కెరీర్ దాదాపుగా ముగిసిపోయినట్టే. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ చిత్రాన్ని విశ్వక్ సేన్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది.