Homeఎంటర్టైన్మెంట్Allu Sirish Pre Wedding Party Photos: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ లో...

Allu Sirish Pre Wedding Party Photos: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ లో అల్లు అర్జున్ తో రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోలు వైరల్!

Allu Sirish Pre Wedding Party Photos: అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish) వచ్చే నెల 6వ తేదీన నయనికా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా మొదటి శుభలేఖ ని ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి ఇచ్చి, పెళ్లి పనుల్లోకి దిగాడు. తెలుగు సంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి ముందు జరగాల్సిన కొన్ని కార్యక్రమాలను కూడా జరిపించారు. ఈ పనుల్లో అల్లు అర్జున్ షూటింగ్ లో ఉండడం వల్ల హాజరు కాలేకపోయాడు. కానీ నిన్న రాత్రి అల్లు శిరీష్ ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ లో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి తో కలిసి పాల్గొన్నాడు. ఈ పార్టీ లో స్నేహ రెడ్డి ధరించిన పొట్టి దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క ఈ పార్టీ కి రామ్ చరణ్, ఉపాసన కూడా జంటగా హాజరయ్యారు.

రామ్ చరణ్ అయ్యప్ప మాల లో ఉండడం విశేషం. అయితే అయ్యప్ప మాల వేసుకొని పార్టీలకు హాజరు అవ్వొచ్చా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా లో సాగుతోంది. అయితే అల్లు శిరీష్ తన కాబోయే భార్య నయనికా తో కలిసి జంటగా ఫోటో దిగడం, వీళ్లకు వైపున అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు ఉండగా, మరోవైపు రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన దంపతులు ఉండడం, మెగా అభిమానులకు కనుల పండుగ లాగా అనిపించింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ , వీళ్ళ మధ్య కొన్ని విభేదాలు ఈమధ్య కాలంలో చోటు చేసుకున్నాయని, అందుకే రామ్ చరణ్ అల్లు క్యాంప్ కి దూరం గా వచేసాడని సోషల్ మీడియా లో ఎన్నో ఏళ్ళ నుండి ప్రచారం అవుతోంది.

కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చెప్పకనే చెప్తున్నారు ఈ ఇద్దరు హీరోలు. ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా లో పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ గొడవలు ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇరువురి హీరోల అభిమానులు కలిసిపోతూ ఉంటారు. గతం లో ఎన్నోసార్లు అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి, ఇప్పుడు మరోసారి ఆ సమయం వచ్చేసింది. ఇక అల్లు శిరీష్ పెళ్లి వేడుక లో మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఒకే చోట ఉంటారు. పవన్ కళ్యాణ్ వస్తాడో లేదో తెలియదు కానీ, ఆయన కూడా వస్తే వేరే లెవెల్ లో ఉంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ వివాహ వేడుక ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular