Sukumar and Ram Charan : ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) బాగా అలెర్ట్ అయ్యాడు. డైరెక్టర్స్ ని చూసి సినిమాలను ఓకే చేయకుండా, బలమైన బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే సుకుమార్(Sukumar) తో చేయబోయే సినిమాని ప్రస్తుతం హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం స్టోరీ లైన్ మాత్రమే ఫిక్స్ చేశారట. సినిమా మొత్తం మొదలయ్యేది బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాతే అని సుకుమార్ కి క్లారిటీ గా చెప్పాడట రామ్ చరణ్. తనకు రంగస్థలం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ విషయం లో కూడా రామ్ చరణ్ ఇలా ఉన్నాడంటే, ‘గేమ్ చేంజర్’ ఎఫెక్ట్ ఆయనపై ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక నుండి ఎట్టి పరిస్థితిలోను అభిమానులను నిరసపర్చేందుకు రామ్ చరణ్ సిద్ధంగా లేనట్టు స్పష్టంగా తెలుస్తుంది.
Also Read : రామ్ చరణ్ సినిమాకి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్..షాక్ లో ఫ్యాన్స్..కారణం ఏమిటంటే!
సుకుమార్ సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన చిక్కుడు రాజమౌళి కి ఏమాత్రం తీసిపోదు అనొచ్చు. ‘పుష్ప 2 ‘ మూవీ స్క్రిప్ట్ పై ఆయన దాదాపుగా ఏడాది పని చేసాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో తీయబోయే సినిమా మిషన్ ఇంపాజిబుల్ లాంటి యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ స్క్రిప్ట్ ఉండబోతుంది. అందుకే ఆయన దీర్ఘకాలిక సమయం కోరడంతో రామ్ చరణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే రామ్ చరణ్ పుట్టినరోజు నాడు, ఈ మూవీ టీం నుండి ఎలాంటి శుభాకాంక్షలు రానప్పుడే అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఈ సినిమా ఇప్పట్లో మొదలు అవ్వదు అని. మరి రామ్ చరణ్ ‘పెద్ది’ తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ రామ్ చరణ్ కి ఒక స్క్రిప్ట్ ని వినిపించి చాలా రోజులైంది. ఈ సినిమా మనం కచ్చితంగా చేస్తున్నాం అని రామ్ చరణ్ చెప్పాడు కానీ, ఎప్పటి నుండి మొదలు అవుతుంది అనే క్లారిటీ మాత్రం అప్పట్లో నిఖిల్ కి ఇవ్వలేదు. అయితే సుకుమార్ స్క్రిప్ట్ విషయం లో ఎక్కువ సమయం కోరడంతో ముందుగా నిఖిల్ నగేష్ సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యినట్టు తెలుస్తుంది. నిఖిల్ నగేష్ భట్ గతం లో ‘కిల్’ అనే చిత్రం చేసాడు. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా డైరెక్టర్ తో పని చేయడానికి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ నిఖిల్ మాత్రం ముందుగా రామ్ చరణ్ తో చేయాలనీ అనుకోవడం విశేషం. అక్టోబర్ నెలలో ‘పెద్ది’ మూవీ షూటింగ్ పూర్తి అవుతుంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
Also Read : రామ్ చరణ్ తో సుకుమార్ మళ్ళీ సైకిల్ తొక్కిస్తున్నాడా..?