Homeజాతీయ వార్తలుPost office monthly income scheme: మధ్య తరగతికి మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం.. ఇలా చేస్తే...

Post office monthly income scheme: మధ్య తరగతికి మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం.. ఇలా చేస్తే నెలనెలా ఆదాయం!

Post office monthly income scheme: దేశంలో ప్రస్తుతం పోస్టాఫీసుల స్వరూపాలు మారిపోయాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఉత్తరాల బట్వాడా బాగా తగ్గింది. దీంతో పోస్టాఫీజులు బ్యాంకింగ్‌ తరహా సేవలు, ఇన్సూరెన్స్‌ తరహా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పొదుపు, ఆదాయ పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే వీటిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారు. నెలనెలా ఆదాయం కోసం.. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (పోమిస్‌) 7.4% […]

Post office monthly income scheme: దేశంలో ప్రస్తుతం పోస్టాఫీసుల స్వరూపాలు మారిపోయాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఉత్తరాల బట్వాడా బాగా తగ్గింది. దీంతో పోస్టాఫీజులు బ్యాంకింగ్‌ తరహా సేవలు, ఇన్సూరెన్స్‌ తరహా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పొదుపు, ఆదాయ పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే వీటిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారు.

నెలనెలా ఆదాయం కోసం..
పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (పోమిస్‌) 7.4% వార్షిక వడ్డీ ఇస్తుంది, నెలవారీగా ప్రిన్సిపల్‌పై సింపుల్‌ ఇంట్రెస్ట్‌ రూపంలో చెల్లిస్తారు. నెలవారీ వడ్డీ = (పెట్టుబడి ణ 7.4%)/ సంవత్సరాల టెన్యూర్‌తో ప్రభుత్వ బ్యాకింగ్‌ ఉండటంతో 100% సురక్షితం. మెచ్యూరిటీలో ప్రిన్సిపల్‌ తిరిగి వస్తుంది.

పెట్టుబడి, అర్హత వివరాలు..
సింగిల్‌ అడల్ట్‌ కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా 9 లక్షల వరకు డిపాసిట్‌ చేయవచ్చు. జంటగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇక మైనర్లు అంటే పదేళ్లలోపువారు కనిష్టంగా రూ.1,000 గరిష్టంగా రూ.3 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు.
ఇక అర్హత వివరాలకు వస్తే 18 ఏళ్లు నిండి ఉండాలి. గార్డియన్లు మైనర్ల పేరిట తెరవవచ్చు. నామినీ సౌకర్యం ఉంది. దక్షిణ పోస్టల్‌ సర్కిల్‌ (తెలంగాణ సహా)లో 1 లక్ష మించి డిపాజిట్‌లకు ముందుగా అనుమతి అవసరం.

రిటర్నులు ఇలా..
రూ.4 లక్షలు డిపాజిట్‌ చేస్తే నెలనెలా రూ.2467 ఆదాయం వస్తుంది. ఐదేళ్లకు రూ.1,48 లక్షలు పొందవచ్చు. ఇక రూ.5 లక్షలు డిపాజిట్‌ చేస్తే నెలనెలా రూ.3,083 చొప్పున ఐదేళ్లలో రూ.1.85 లక్షలు పొందుతారు. ఇక రూ.9 లక్షలు డిపాజిట్‌ చేస్తే నెలనెలా రూ.5,550 చొప్పున ఐదేళ్లకు రూ.3.33 లక్షలు పొందే వీలుంటుంది. గరిష్టంగా రూ.15 లక్షలు డిపాజిట్‌ చేసినవారు నెలకు రూ.9,250 చొప్పున ఐదేళ్లలో రూ.5.55 లక్షలు పొందుతారు.

ప్రీమ్యాచ్యూర్‌ విత్‌డ్రాయల్‌ నియమాలు
డిపాజిట్‌ను ఏడాది పాటు ఉంచాలి. ఆ తర్వాత మాత్రమే తిరిగి తీసుకునే వీలుంటుంది. 3 సంవత్సరాల ముందు తీసుకుంటే 2 శాతం పెనాల్టీ పడుతుంది. మూడు నుంచి ఐదేళ్ల మధ్య తీసుకుంటే 1 శాతం ఫైన్‌ చెల్లించాలి. పెనాలిటీ డబ్బులు కట్‌ చేసుకుని మిగతా మొత్తం చెల్లిస్తారు.

ట్యాక్స్‌ ప్రయోజనాలు
వడ్డీపై ట్యాక్స్‌ వర్తిస్తుంది. సాధారణంగా రూ.40 వేలు, సీనియర్‌ సిటిజన్లు రూ.50 మించితే టీడీఎస్‌(10 శాతం), ఇండక్షన్‌ లేదు. మధ్యతరగతి, రిటైర్డ్‌ వ్యక్తులకు రెగ్యులర్‌ ఆదాయం కోసం ఉత్తమ పథకం. మెచ్యూర్‌ తర్వాత మరో 5 సంవత్సరాలు ఎక్స్‌టెండ్‌ చేయవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper