Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు రావాలి. టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి చాలా సంవత్సరాల పాటు ఒక్క అవకాశం కోసం ఎదురు చూడాల్సిన సమయమైతే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీకి వచ్చి నటులుగా ప్రూవ్ చేసుకొని సక్సెస్ఫుల్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు… మోహన్ బాబు లాంటి నటుడు సైతం కెరియర్ మొదట్లో విలన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి హీరోగా మారాడు. ఆయన చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ హీరోగా నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటికి ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ గో గా వ్యవహరిస్తూ ఉంటాడు. గత కొద్ది రోజులుగా ఆయన తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోవడంతో అసలు సినిమాలే చేయడం లేదు. తన కొడుకుల సినిమాల్లో నటిస్తున్నాడు తప్ప ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఇప్పుడు తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలో మాలిక్ అనే ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక దాంతో పాటుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో సైతం మోహన్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.
ఇక వీళ్లిద్దరితో పాటు మరి కొంతమంది స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్లో నటించడానికి సైతం మోహన్ బాబు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా మోహన్ బాబు క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతుందట. ఈ మూవీలో మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడా? లేదంటే పాజిటివ్ క్యారెక్టర్ లోనే నటించి మెప్పించబోతున్నాడా అనే విషయం మీద ఇంకా సరైన క్లారిటి రాలేదు కానీ మొత్తానికైతే ఈ సినిమాలో మోహన్ బాబు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు అంటూ ఫిలింనగర్ సర్కిల్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది…
సుకుమార్ డైరెక్షన్లో మోహన్ బాబు నటించబోయే మూవీ చాలా గ్రాండ్ గా ఉండబోతుందనే విషయమైతే చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇక ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మాత్రం ఇటు సుకుమార్, అటు మోహన్ బాబు ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…