https://oktelugu.com/

పుష్ప విడుదల విషయంలో సుక్కు సీరియస్ !

టాలీవుడ్ లో ఇప్పటికే భారీ సినిమాల విడుదల తేదీలను కూడా ఇబ్బడిముబ్బడిగా ప్రకటించేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అనేక అనుమానాలను కలిగిస్తోంది. సరైన లెక్కలన్నీ వేసుకుని డేట్స్ ప్రకటిస్తున్నారా ? లేదా తర్వాత డేట్స్ విషయంలో క్లాష్ వస్తుందేమో అనుకుని ముందుగానే త్వరపడుతున్నారా ? నిజంగా ఈ సినిమాలన్నీ ప్రకటించిన రోజున విడులవటం కుదిరే పనేనా ? అంటే ఎవరికీ క్లారిటీ లేదు. ముందుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 2, 2021 / 11:34 AM IST
    Follow us on


    టాలీవుడ్ లో ఇప్పటికే భారీ సినిమాల విడుదల తేదీలను కూడా ఇబ్బడిముబ్బడిగా ప్రకటించేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అనేక అనుమానాలను కలిగిస్తోంది. సరైన లెక్కలన్నీ వేసుకుని డేట్స్ ప్రకటిస్తున్నారా ? లేదా తర్వాత డేట్స్ విషయంలో క్లాష్ వస్తుందేమో అనుకుని ముందుగానే త్వరపడుతున్నారా ? నిజంగా ఈ సినిమాలన్నీ ప్రకటించిన రోజున విడులవటం కుదిరే పనేనా ? అంటే ఎవరికీ క్లారిటీ లేదు. ముందుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘పుష్ప’ మూవీ విడుదల విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతుంది.

    Also Read: జనవరి రిపోర్ట్ : ఒకే ఒక్క హిట్ మిగిలిన‌వ‌న్నీ ఫ్లాపులే !

    ఇప్పటికే ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 13న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే సినిమాను కుదిరితే సంవత్సారాల పాటు చెక్కుతూ కూర్చోటానికి మొగ్గు చూపే టాలీవుడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. అలాంటి దర్శకుడు చాలా ముందుగానే నిర్ణయించిన తేదీకి మూవీని పూర్తి చేయటం అంటే దాదాపు అసంభవమని చెబుతున్నారు సినీ జనం. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన అసలు సుకుమార్ కి తెలియకుండా జరిగిందట. అందుకే ఈ రిలీజ్ డేట్ విషయంలో సుకుమార్ కాస్త ఫీల్ అయ్యాడని.. నిర్మాతల పై గుర్రుగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

    Also Read: ఎట్టకేలకు పట్టాలెక్కుతున్న నాగ్ ‘బంగార్రాజు’

    ఏది ఏమైనా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి ఓ ప్రధాన సమస్య ఉంది. ప్రొడ్యూసర్స్ బాధను ఆయన అర్ధం చేసుకోరు అనేది ఆయన పై ఉన్న ప్రధాన ఆరోపణ. సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది.. మళ్లీ ఎంత రిటర్న్ వస్తోంది లాంటి లెక్కల విషయంలో ఈ లెక్కల మాస్టర్ లెక్కలు అసలు క్లారిటీ ఉండవు అని, నిర్మాతలకు చివరకు చుక్కుల చూపిస్తాడని ఎప్పటి నుండో సుక్కు పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా.. సుకుమార్ అంటే స్టార్ హీరోలకు ఓ నమ్మకం. గొప్ప టాలెంటెడ్ డైరెక్టర్ అనే ఓ గొప్ప భరోసా. అందుకే ప్రస్తుతం స్టార్స్ అందరూ సుకుమార్ తో సినిమా అనగానే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. మరి సుక్కు ఏం చేస్తాడో చూద్దాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్