నిమ్మగడ్డకు హైకోర్టు చెక్‌

అధికారం దొరికింది కదా అని అడ్డూఅదుపు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని ప్రభుత్వంపై రుద్దడం.. ఇప్పుడు ఏపీలో ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ చేస్తున్న రాజకీయం అదే. చీటికిమాటికి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం.. ఇష్టం వచ్చినట్లుగా ఆఫీసర్లను బదిలీ చేయడం. దీంతో ఒకవిధంగా రాష్ట్రంలో నిమ్మగడ్డపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. రాజ్యాంగ పదవి అంటూ శివాలెత్తుతున్న నిమ్మగడ్డకు హైకోర్టు చెక్‌ పెట్టింది. నిమ్మగ‌డ్డకు హైకోర్టు తిక్క కుదిర్చింద‌నే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుపుకోవచ్చని […]

Written By: Srinivas, Updated On : February 2, 2021 12:17 pm
Follow us on


అధికారం దొరికింది కదా అని అడ్డూఅదుపు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని ప్రభుత్వంపై రుద్దడం.. ఇప్పుడు ఏపీలో ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ చేస్తున్న రాజకీయం అదే. చీటికిమాటికి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం.. ఇష్టం వచ్చినట్లుగా ఆఫీసర్లను బదిలీ చేయడం. దీంతో ఒకవిధంగా రాష్ట్రంలో నిమ్మగడ్డపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. రాజ్యాంగ పదవి అంటూ శివాలెత్తుతున్న నిమ్మగడ్డకు హైకోర్టు చెక్‌ పెట్టింది. నిమ్మగ‌డ్డకు హైకోర్టు తిక్క కుదిర్చింద‌నే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుపుకోవచ్చని హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో హూందాగా వ్యవ‌హ‌రించ‌డానికి బ‌దులు నిమ్మగడ్డ ఓవర్‌‌ యాక్షన్‌ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: వైసీపీలోకి వేస్ట్‌గా వచ్చానా..!: మోహన్‌బాబు పశ్చాత్తాపం

కోర్టు ఆదేశాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేయ‌డం లేదంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్ విచార‌ణ చేప‌ట్టారు. ఈ కోర్టు ధిక్కార‌ణ పిటిష‌న్‌ను ప్రచారం కోసం దాఖ‌లు చేశారా? అని నిమ్మగ‌డ్డ ర‌మేష్‌ కుమార్‌ను న్యాయ‌మూర్తి నిల‌దీశారు. డిసెంబ‌ర్‌ 18న దాఖ‌లు చేసిన కోర్టు ధిక్కర‌ణ‌ పిటిష‌న్ 42 రోజులపాటు కోర్టు ముందు విచార‌ణ‌కు రాలేద‌ని, కానీ పిటిష‌న్‌లోని ప్రతి అక్షరం ఆ మ‌రుస‌టి రోజు అంటే డిసెంబ‌ర్ 19న అన్ని ప‌త్రిక‌ల్లో ప్రముఖంగా ప‌బ్లిష్ అయింద‌ని గుర్తు చేశారు. దీంతో పిటిష‌న్ వేసిన ప్రయోజనం నెర‌వేరింద‌ని ఎస్ఈసీ భావించిన‌ట్టున్నార‌ని జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ ఘాటు వ్యాఖ్యలే చేశారు.

Also Read: బాబు గారూ ఇదేమి రాజకీయం : ఆశ్చర్యపోతున్న టీడీపీ క్యాడర్
‌‌

నిమ్మగడ్డ రమేష్ కేవలం ప్రచారం కోసమే కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారన్న అభిప్రాయం న్యాయస్థానానికి కలుగుతోందని ఘాటుగా హైకోర్టు వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. డిసెంబ‌ర్ 18న పిటిష‌న్ వేస్తే జ‌న‌వ‌రి 29వ తేదీ వ‌ర‌కూ విచార‌ణ‌కు ఎందుకు రాలేద‌ని, ఇన్ని రోజులు ఆల‌స్యం కావ‌డానికి త‌ప్పు మీదా? రిజిస్ట్రీదా? అని ఎస్ఈసీ త‌ర‌పు న్యాయ‌వాది అశ్వనీకుమార్‌ను న్యాయ‌మూర్తి ప్రశ్నించారు. కేసు విచారణకు వచ్చేందుకు రిజిస్ట్రీకి లేఖలు రాశానని, ఫోన్లు కూడా చేశానని అశ్వనీ చెప్పాడు. అత్యవసరంలేదని భావించే 42 రోజులు మౌనంగా ఉన్నారా? అంటూ న్యాయమూర్తి మళ్లీ ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

‘నిజంగా అత్యవసరమని భావించే ఉంటే ఈ కోర్టులో ప్రస్తావించి ఉండేవారు. ఆ పని చేయలేదంటే వారు ఏ ప్రయోజనం ఆశించి కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారో సులభంగా అర్థమవుతోంది. ఇన్ని రోజులు మౌనంగా ఉండి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నారంటే ప్రతివాదులపై (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి) ఒత్తిడి పెంచడానికి ఇలా చేస్తున్నారని ఈ కోర్టు భావిస్తోంది. ఎన్నికల కమిషనర్‌ సదుద్దేశాలపై ఈ కోర్టుకు సందేహం కలుగుతోంది’.. అని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా హైకోర్టు వ్యాఖ్యలతో ఎస్‌ఈసీ తిక్క కుదిరినట్లేననే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.