https://oktelugu.com/

క్రేజీ కలయిక నుండి ఇంట్రస్టింగ్ పోస్టర్ !

సినిమా ఇండస్ట్రీలో క్రమంగా కరోనా నిబంధనలు ఎత్తేస్తున్నారు. దాంతో దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను పోటీ పడి మరీ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా బడా సినిమాలు తమ విడుదల తేదీని ప్రకటించగా.. తాజాగా విడుదల చేసిన ఓ సినిమా పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మాస్ డైరెక్టర్ మారుతి తన కొత్త సినిమా గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో తీస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. వినోదం తప్పకుండా ఉంటుందని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 2, 2021 / 11:45 AM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో క్రమంగా కరోనా నిబంధనలు ఎత్తేస్తున్నారు. దాంతో దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను పోటీ పడి మరీ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా బడా సినిమాలు తమ విడుదల తేదీని ప్రకటించగా.. తాజాగా విడుదల చేసిన ఓ సినిమా పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మాస్ డైరెక్టర్ మారుతి తన కొత్త సినిమా గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో తీస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. వినోదం తప్పకుండా ఉంటుందని భరోసా కూడా ఇచ్చాడు ఆ మధ్య ట్విట్టర్ వేదికగా.

    Also Read: పుష్ప విడుదల విషయంలో సుక్కు సీరియస్ !

    కాగా థియేటర్‌లో ఉండే కుర్చీపై కర్చీప్ వేస్తోన్న ఫొటోతో పాటు.. అక్టోబర్‌ 1న విడుదల అనే టైటిల్‌తో కూడిన ఫొటోను పోస్ట్‌ చేశాడు మారుతి. అయితే ఆ పోస్టర్‌లో ‘సినిమా పేరు లేదు.. హీరో పిక్ లేదు.. హీరోయిన్ ఎవరో తెలియదు.. డైరెక్టర్ పేరు రాయలేదు.. ఒక బ్యానర్ లేదు.. ఫస్ట్ లుక్ వదలలేదు.. ప్రొడ్యూసర్ పేరు లేదు.. షూటింగ్ డేట్ ఫిక్స్ అవలేదు.. అందరూ రిలీజ్ డేట్ ఖర్చీఫ్ చేస్తున్నారని ఊరికి ముందే అక్టోబర్ ఒకటి రిలీజ్ అనడమేంటో’ అంటూ రాసున్న వ్యాఖ్యలు మొత్తానికి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

    Also Read: జనవరి రిపోర్ట్ : ఒకే ఒక్క హిట్ మిగిలిన‌వ‌న్నీ ఫ్లాపులే !

    ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టైటిల్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తారట. ఈ సినిమా కోసమే మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ రిజిస్టర్ చేశారని టాక్ నడుస్తుంది. మారుతి నుండి మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు, ఇక అల్లు అరవింద్ కంపెనీ నుండి వస్తుందంటే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందని అనుకోవచ్చ, గోపీచంద్ కెరీర్ మొదట్లో విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.

    ప్రస్తుతం ఈ హీరో పరిస్థితి డైలమాలో ఉంది. సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి హీరోకి మంచి హిట్ సినిమా పడితే చూడాలని అభిమానులు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. చూడాలి మారుతి హిట్ ఇస్తాడేమో.