https://oktelugu.com/

సుక్కు పైత్యం.. బాధలో బన్నీ !

క్రియేటివ్ డైరెక్టర్ అని ముందు పేరు వేసుకుని ప్రొడ్యూసర్స్ ను ముంచిన డైరెక్టర్ల లిస్ట్ పెద్దదే. వాళ్ళేదో సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు సుకుమార్ కూడా ఆ కోవలోకే వచ్చేలా ఉన్నాడట. సుక్కు ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. నిజానికి వీరి కలయికలో సినిమా వస్తోందంటేనే.. అంచనాలు రెట్టింపు ఆవుతాయనేది వాస్తవమే. అంతమాత్రాన ఓవర్ బడ్జెట్ చేస్తే ఎలా.. ? రేపు బడ్జెట్ ఎక్కువై సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : August 4, 2020 / 02:22 PM IST
    Follow us on


    క్రియేటివ్ డైరెక్టర్ అని ముందు పేరు వేసుకుని ప్రొడ్యూసర్స్ ను ముంచిన డైరెక్టర్ల లిస్ట్ పెద్దదే. వాళ్ళేదో సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు సుకుమార్ కూడా ఆ కోవలోకే వచ్చేలా ఉన్నాడట. సుక్కు ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. నిజానికి వీరి కలయికలో సినిమా వస్తోందంటేనే.. అంచనాలు రెట్టింపు ఆవుతాయనేది వాస్తవమే. అంతమాత్రాన ఓవర్ బడ్జెట్ చేస్తే ఎలా.. ? రేపు బడ్జెట్ ఎక్కువై సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోతే. చివరకి ప్లాప్ అనే అంటారు కదా. మరి ఈ విషయం సుక్కు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడో. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఎవరైనా ఖర్చు తగ్గించుకుంటారు. మెగాస్టార్- కొరటాల సినిమాకే ముందు అనుకున్న బడ్జెట్ కి పది కోట్లు తగ్గించారు. కానీ, సుకుమార్ మాత్రం బడ్జెట్ తగ్గించేదే లేదు అంటున్నాడట.

    Also Read: ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ సీక్రెట్స్ !

    సరేలే అని నిర్మాతలు ముందు అనుకున్న ప్రకారమే వెళ్దాం అని సర్దిచెప్పుకుంటే.. ఇప్పుడు క్యాస్టింగ్ కోసం అదనపు బడ్జెట్ అడుగుతున్నాడట. బాలీవుడ్ స్టార్స్ ను ఎట్టిపరిస్థితుల్లో తమ సినిమాలో తీసుకోవాలని దాని కోసం అదనంగా మరో పది కోట్ల రూపాయలను బడ్జెట్ పెంచాలని అంటే.. బన్నీ జోక్యంతో నిర్మాతలు బడ్జెట్ పెంచారు. ఆ తరువాత మళ్ళీ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ సముద్రంలో చేద్దామని దాని కోసం హాలీవుడ్ సాంకేతిక బృందాన్ని తీసుకుందామని సుక్కు పట్టుబడుతున్నాడట. అసలు నువ్వు ఎంత నీ సినిమా రేంజ్ ఎంత ఇలా ప్రతి విషయంలో ఓవర్ బడ్జెట్ చేస్తే.. రేపు తిరిగి వస్తాయా అని నిర్మాతలు కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

    అయినా సుకుమార్ తగ్గడం లేదట. బన్నీ కూడా సుక్కుకి నచ్చచెప్పాలని చూస్తున్నా వినే స్థితిలో సుక్కు లేడని.. రంగస్థలం సూపర్ హిట్ మహిమ సుక్కుని మైకంలో పడేసిందని బన్నీ కూడా బాధ పడుతున్నాడట. మొత్తానికి సుకుమార్ పైత్యం దెబ్బకు పుష్ప టీంకి చుక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఇంతకీ సుక్కు తన అంచనాలను అందుకుంటాడా ?ఒకవేళ సినిమా భారీ హిట్ కొట్టినా ఓవర్ బడ్జెట్ అయితే డబ్బులు రికవరీ అవుతాయా.. నిర్మాతలు మాత్రం సినిమా పై విపరీతమైన హోప్స్ పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప.. ప్రస్తుతం వారి చేతిలో కూడా ఏమి లేన్నట్లు కనిపిస్తుంది.

    Also Read: మోహన్‌బాబు ఇంటికెళ్ళి బెదిరించింది వారే !

    ఇక అక్టోబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక బన్నీ సరసన ఎలా ఉంటుందో చూడాలి. దేవీ శ్రీ పుష్ప సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.