https://oktelugu.com/

రాజధానుల రాజకీయ రగడ మొదలైయింది

ఆంధ్రప్రదేశ్ లో రాజధానుల రాజకీయ రగడ మొదలయింది, మూడు రాజధానుల విషయంలో దమ్ము ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రండి అని సర్కార్ కు 48 గంటల గడువు ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు , ప్రతిగా అధికార పక్షం దమ్ము ఉంటే ముందుగా మీరు రాజీనామా చెయ్యండి అని సవాల్ విసిరారు. Also Read: ఎలా దెబ్బకొట్టాలో.. కేసీఆర్ ఆదర్శం అంతే! ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారు ఇప్పుడు రాజధానిని మూడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 4, 2020 / 02:39 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో రాజధానుల రాజకీయ రగడ మొదలయింది, మూడు రాజధానుల విషయంలో దమ్ము ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రండి అని సర్కార్ కు 48 గంటల గడువు ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు , ప్రతిగా అధికార పక్షం దమ్ము ఉంటే ముందుగా మీరు రాజీనామా చెయ్యండి అని సవాల్ విసిరారు.

    Also Read: ఎలా దెబ్బకొట్టాలో.. కేసీఆర్ ఆదర్శం అంతే!

    ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారు ఇప్పుడు రాజధానిని మూడు ముక్కలు చేసారు, ఎందుకు ఇలా దుర్మార్గంగా, అన్న్యాయంగా , కిరాతంగా రాజధానిని విడదీసి ప్రాంతీయ చిచ్చు పెట్టారు, అని చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు.

    2014 సెప్టెంబర్ 4వ తేదీన జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణానికి తన అంగీకారాన్ని తెలిపారు, అధికారంలోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తుంగలో తొక్కి రాజధానిని చీల్చి, మడమ తిప్పారు.పైగా 30 వేల ఎకరాలు ఎక్కడ లభ్యమైతే అక్కడే రాజధానిని నిర్మించాలని సలహా కూడా ఇచ్చారు.

    రాజధాని విషయంలో అప్పటి ప్రభుత్వమే బలమైన చట్టాన్ని చేయవలసింది అని జన సేనాని వ్యాఖ్యానించారు, ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకుడు తప్పు పడుతున్నారు, విభజన చట్టంలో ఒక రాజధాని ప్రస్తావన వుంది కానీ మూడు రాజధానుల ప్రస్తావన లేదు అని జన సేనానికి గుర్తు చేసారు.

    ఏది ఏమైనప్పటికి అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు 200ల రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు వారి గోడును వీనే నాధులే కరువైయాయ్యారు. వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి ఇస్తే ఇప్పుడు మూడు రాజధానులేమిటి అని వాపోతున్నారు, తిరిగి ఎక రాజధాని ప్రకటన చేసేవరకు తమ పోరాటం ఆగదు, ఈ క్రమంలో తమ ప్రాణాలు పోయినా సరే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని భూములిచ్చిన రైతులు ప్రకటించారు .

    అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత ఆ ప్రాతంలో ఎన్నో సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి, మరి వాటి సంగతి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.

    Also Read: అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?

    రాజకీయంగా ఒకరిని ఒకరు ధూషించుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచించే నాయకులే కరువైయ్యారు. మీరు అధికారంలో వున్నప్పుడు రాజధాని చుట్టుపక్కల భూములన్నీ చౌకగా కొట్టేసి, ఇప్పుడు నీతులు చెబుతున్నారు అంటూ ప్రతిపక్షంపై ఎదురు దాడి చేస్తున్నారు వై సి పీ నాయకులు.

    చంద్రబాబు ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ కు కట్టుబడి అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయానికి వెళతారో లేక రాజధానుల రాజకీయ రగడను కొనసాగిస్తారా ? అనే సమాధానం కావాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు.