https://oktelugu.com/

మోహన్‌బాబు ఇంటికెళ్ళి బెదిరించింది వారే !

మోహన్‌ బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్లి.. అందులో నలుగురు మైకంలో ఉన్న కుర్రాళ్లు దిగి మిమ్మల్ని వదలమంటూ వీరంగం సృష్టించిన యవ్వారం తెలిసిందే. సహజంగా ఇలాంటి బెదిరింపులు మంచు ఫ్యామిలీనే అందరికీ ఇస్తుంటారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. కానీ, కామెడీగా ఈ సారి మంచు ఫ్యామిలీ మొత్తానికే ఆ బెదిరింపులు తగిలాయి. ఇంతకీ ఆ బెదిరింపులు జారీ చేసిన దుండగులు ఎవరయ్యా అంటే.. మంచు ఫ్యామిలీ శంషాబాద్ లో కట్టుకున్న ఇంటి పక్కన […]

Written By:
  • admin
  • , Updated On : August 4, 2020 / 01:39 PM IST
    Follow us on


    మోహన్‌ బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్లి.. అందులో నలుగురు మైకంలో ఉన్న కుర్రాళ్లు దిగి మిమ్మల్ని వదలమంటూ వీరంగం సృష్టించిన యవ్వారం తెలిసిందే. సహజంగా ఇలాంటి బెదిరింపులు మంచు ఫ్యామిలీనే అందరికీ ఇస్తుంటారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. కానీ, కామెడీగా ఈ సారి మంచు ఫ్యామిలీ మొత్తానికే ఆ బెదిరింపులు తగిలాయి. ఇంతకీ ఆ బెదిరింపులు జారీ చేసిన దుండగులు ఎవరయ్యా అంటే.. మంచు ఫ్యామిలీ శంషాబాద్ లో కట్టుకున్న ఇంటి పక్కన స్ధలం ఉన్నవారు అట. స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ లేకపోయినా… ఆ స్థలానికి వెళ్లే దారి విషయంలో తేడా వచ్చిందని.. దాంతో మంచు ఫ్యామిలీ పై ఆ స్థలం తాలూకు వ్యక్తులు కోపం పెంచుకున్నారని.. ఈ క్రమంలో ఆ వ్యక్తుల పిల్లలే మంచు ఇంటిలో దూరి హెచ్చరించి వెళ్లారని తెలుస్తోంది.

    Also Read: ‘పుష్ప’ స్టోరీ అదేనా!

    వారి హెచ్చరికలకు భయానికి లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. అయితే ఇందులో మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ ప్రమేయం కూడా ఉందని అంటున్నారు. అతను ఆ రోజు కావాలనే అప్రమత్తంగా లేడట. భారీ గేటు నుండి ఒక ఇన్నోవా కారు లోపలకి రావాలంటే వాచ్ మెన్ గేటు తీయాలి. కారులో వాళ్లు దుండగులు అని, తాగి ఉన్నారని క్లియర్ గా తెలిసిన తరువాత కూడా వాచ్ మెన్ గేటు ఎందుకు తీశాడని మంచు ఫామిలీ అతని పై సీరియస్ అయింది.

    Also Read: మూడో పెళ్లి చేసుకున్నా సుఖం లేదట !

    ఇక కారులో ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మోహన్‌బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత అవసరం, ఆ స్థాయి శత్రువులు ఎవరా అని ఆలోచిస్తున్న క్రమంలో వీళ్ళ గురించి తెలిసి దొరికిపోయారు. ఏది ఏమైనా ఆ ఆకతాయిలు మోహన్‌బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో రాకపోయినా.. వారు చేసింది తప్పే. ఎవరు ఈ పనికి పూనుకున్నా తగిన చర్యలు తీసుకోవాల్సిందే.