Sukumar , Ram charan
Sukumar and Ram charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏకైక డైరెక్టర్ సుకుమార్(Sukumar)…ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని అయితే ఎంచుకుంటూ ఉంటాడు. మరి ఆయన చేసే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
సుకుమార్ (Sukumar) రీసెంట్ గా చేసిన పుష్ప 2 (pushpa 2)సినిమాతో భారీ విజయాన్ని అందుకునన్నాడు. ఇక తనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన రామ్ చరణ్ (Ram Charan)తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు (Buchhi babu)డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా ఉంటుందని యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం ‘ (Rangasthalam) సినిమాలో చరణ్ చిట్టి బాబుగా కనిపించడమే కాకుండా ఒక చెవిటి వాడి పాత్రలో నటించి మెప్పించాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సైకిల్ తొక్కే పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి రంగస్థలం సినిమాలో కూడా రామ్ చరణ్ సైకిల్ మీదనే కనిపించాడు. మరోసారి అలాంటి పాత్రని రిపీట్ చేస్తూ కొత్తదనాన్ని ఆడ్ చేసి చూపించే విధంగా సుకుమార్ ప్రణాళికలు చేసుకుంటున్నాడట. అయితే ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ అదే లుక్ లో ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులను మెప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
కాబట్టి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాతో మరోసారి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాతో ఈ సంవత్సరం డీలాపడిన రామ్ చరణ్ వచ్చే ఏడాది మంచి సినిమాలతో ప్రేక్షకులను అరించే ప్రయత్నం చేస్తానని తన అభిమానులకు మాటిచ్చాడు.
ఇక అందులో భాగంగానే సుకుమార్ తో చేయబోయే సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని ఆయన కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తుండటం విశేషం… మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా మంచి హైప్ అయితే ఉంది.
మరి ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నప్పటికి మీ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఈ విషయం మీద సినిమా యూనిట్ గాని, సుకుమార్ గానీ స్పందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…