https://oktelugu.com/

AP Temperature: జనాలు ఉక్కిరిబిక్కిరి..ఏపీలో ఎందుకు ఈ వాతావరణం మారింది.. వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్

ఈరోజు నుంచి వాతావరణంలో స్పష్టమైన మార్పులు రానున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగనున్నాయి.

Written By: , Updated On : February 18, 2025 / 10:22 AM IST
AP Temperature

AP Temperature

Follow us on

AP Temperature: ఈ ఏడాది ఎండలు దంచి కొట్టేలా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు( temperature) అమాంతం పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఎండలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారానికి అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అప్పుడే సాధారణ కంటే నాలుగైదు డిగ్రీలు పెరగడం విశేషం. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తూనే ఉంది. రాత్రికి చలి వాతావరణం ఉంది. ఏలినో ప్రభావంతో ఈరోజు నుంచి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా ఏపీలో ఐదు ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. 38 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

* కొద్ది రోజుల కిందట నుంచే..
కొద్ది రోజుల కిందట నుంచి ఏపీలో( Andhra Pradesh) ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. రాత్రికి చలి వాతావరణంతో తగ్గుముఖం పడుతున్నాయి. కొద్ది రోజుల కిందట కర్నూలులో ఏకంగా 37.8° అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆ స్థాయిలో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. ఫిబ్రవరి మూడో వారంలో అడుగుపెట్టిన తరుణంలో ఎండల తీవ్రత మరింతగా కనిపిస్తోంది. దీంతో ప్రజల్లో ఒక రకమైన భయం వాతావరణం వెలుగు చూస్తోంది. సముద్ర జలాల కాలుష్యం… వ్యర్ధాలు కలవడం.. ఏలినో ప్రభావం చూపడంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

* పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో
రాష్ట్రంలో విజయనగరం( Vijayanagaram), విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయగోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమలో ఎండల తీవ్రత పెరిగింది. మరోవైపు వాతావరణం లో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతూనే ఉంది. 10 గంటల తర్వాత భానుడు భగభగలు కనిపిస్తున్నాయి. శివరాత్రి నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

* ముందుగానే హెచ్చరిక
ఈరోజు నుంచి వాతావరణం లో స్పష్టమైన మార్పు ఉంటుంది. ఉష్ణోగ్రతలు( temperature) అమాంతం పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే చెప్పుకొచ్చింది. దశాబ్ద కాలం పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని.. 2015 నుంచి 2025 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టమైన సూచనలు చేసింది. అందుకే ఈ ఏడాది ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి పరిస్థితిని తలుచుకొని ఆందోళన చెందుతున్నారు.