Sukumar And Shah Rukh Khan: సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ అనేవి చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి. సక్సెస్ ఫుల్ దర్శకులు, స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు కలిసి సినిమాలు చేస్తే చాలు ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అవుతుంది. దీనివల్ల సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ 3 లో ఒకరిగా నిలిచిన సుకుమార్ (Sukumar) లాంటి దర్శకుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆయన నుంచి ఎలాంటి సినిమా రాబోతుంది అని అతని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదట. దాంతో మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ బాద్షా అయిన షారుక్ ఖాన్ (Sharukh Khan) తో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే సుకుమార్ షారూక్ ఖాన్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా నుంచి కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.
Also Read: గంటకు 20 వేల టిక్కెట్లు..నాగార్జున, ధనుష్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ లోడింగ్!
ఇక వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే అది భారీ సక్సెస్ సాధిస్తుందని షారుఖాన్ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మన తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్ గారు షారుక్ ఖాన్ ను డైరెక్షన్ చేసి భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ అయితే తమిళ స్టార్ డైరెక్టర్ అయిన వెట్రి మారన్ (Vetri Maran) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరితో ఆయన ముందు సినిమా చేయబోతున్నాడు. ఒకవేళ సుకుమార్ తో సినిమా చేస్తే వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది యాక్షన్ అడ్వెంచర్ జానర్లో సినిమాలు తెరకెక్కిస్తాడా లేదంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా షారుక్ ఖాన్ లాంటి హీరోకి గత కొన్ని రోజుల నుంచి భారీ సక్సెస్ అయితే దక్కడం లేదు. తెలుగు సినిమా హీరోలు పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతుంటే ఆయన మాత్రం సక్సెస్ లను సాధించినప్పటికి ఇండస్ట్రీ రికార్డులను మాత్రం కొల్లగొట్టలేకపోతున్నాడు. అందువల్లే తెలుగు సినిమా దర్శకులతోనే సినిమాలు చేసి భారీ సక్సెస్ ని సాధించాలనే ఆలోచనలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read: మరో కొత్త విడుదల తేదీని ప్రకటించిన ‘హరి హర వీరమల్లు’ టీం..సరికొత్త పోస్టర్ వైరల్!