Sujeeth
Sujeeth : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు ఆ సినిమాతో వాళ్లకు ఎనలేని గుర్తింపైతే వస్తుంది. ఒకసారి పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం వాళ్ళకంటూ స్టార్ డైరెక్టర్ ఇమేజ్ అయితే దక్కుతుంది. దాంతో పాటుగా స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…రన్ రాజా రన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సుజిత్(Sijith) ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pavan kalyan) తో ఓ జి (OG) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన రన్ రాజా రన్,సాహో (Sahoo) సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో ఓజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆటోమేటిక్ గా ఆ సినిమా మీద బజ్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఈ సినిమా నుంచి టీజర్ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయనే చెప్పాలి. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీగా తెలియదు. కానీ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలనే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
మొదట్లో కొంతమంది ప్రొడ్యూసర్లను కలిసి కథలు చెప్పినప్పుడు ఒక ప్రొడ్యూసర్ నువ్వు ఈ జన్మలో డైరెక్టర్ కాలేవు. ఒక వేళ డైరెక్టర్ అయినా కూడా సక్సెస్ ని సాధించలేవు అంటూ ఆయన కొన్ని కామెంట్లయితే చేశారట.
ఇక అప్పుడు కోపం వచ్చినపప్పటికి దాన్ని కసిగా తీసుకొని ఎలాగైనా సరే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదగాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగారట. అందువల్లే ఆయన చేసిన సాహో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అప్పుడు ఆ ప్రొడ్యూసర్ సుజిత్ వాళ్ళ అసిస్టెంట్ కు కాల్ చేసి సుజిత్ గారితో ఒకసారి మాట్లాడాలి అని చెబితే సార్ చాలా బిజీగా ఉన్నాడని సుజిత్ వాళ్ళ అసిస్టెంట్ చెప్పారట.
మొత్తానికైతే అలా తను అనుకున్న విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగాడు. అలాగే తనను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి కూడా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సుజిత్ తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఈ సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా లో ఆయన స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడు…