https://oktelugu.com/

Sujeeth: సుజీత్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలుగు స్టార్ హీరో…

ప్రతి ఒక్కరికి ఒక సినిమా చేయాలని ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ఆశ అయితే ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగానే కష్టపడుతూ తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగితే మాత్రం వాళ్లందరికి వాళ్లు అనుకున్న సక్సెస్ అయితే దక్కుతుంది. అలా కాదని ఏమాత్రం కష్టపడకుండా ముందుకు సాగితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 11:55 AM IST

    Sujeeth

    Follow us on

    Sujeeth: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లు తమను తాము ఎలివేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న మన స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా కథలను రాసుకోవడంలో యంగ్ డైరెక్టర్లు కూడా చాలా వరకు తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్లు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక దానికి తగ్గట్టుగానే సాహో సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో ముందుకు దూసుకెళ్తున్న సుజీత్ ఇక తన తదుపరి సినిమాని కూడా ఒక స్టార్ హీరో తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దేవర సినిమాతో ఒక సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ తో సుజీత్ తన తదుపరి సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ కి కథను కూడా వినిపించారట. ఇక ఈ కథ బాగా నచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికైతే సుజీత్ ఓజీ సినిమా అలాగే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథల మీద కసరత్తులు చేస్తూ కూర్చున్నారట. ఇక ఈలోపు ఎన్టీఆర్ వార్ 2 సినిమాని అలాగే ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న డ్రాగన్ సినిమాని పూర్తి చేసుకొని తను సుజీత్ సినిమా కోసం రెడీ అవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    ఏది ఏమైనా కూడా సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ని పెంచుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. షార్ట్ ఫిలిమ్స్ తీసే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాను తీసే స్టేజ్ వరకు ఎదిగిన సుజీత్ ని చూసి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఓజి సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ ని సాధిస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న సుజిత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది…