వరుస హిట్స్, చేతి నిండా సినిమాలు, తెలుగులోనే కాకుండా సౌత్ అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది రష్మిక మందన్నా. ముఖ్యంగా ఈ ఇయర్ అయితే ఆమె కెరీర్లో చాలా స్పెషల్. రష్మిక లైఫ్‌లో 2020 గొప్పగా ఆరంభమైంది. ఆమె హీరోయిన్‌గా నటించిన సరిలేరు నీకెవ్వరూ, భీష్మ సూపర్ హిట్స్ అయ్యాయి. మరెన్నో ఆఫర్లు ఆమె చేతుల్లోకి వచ్చాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోంది. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. హైదరాబాద్‌లో ఫారెస్ట్ సెట్స్ వేసి షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు కన్నడలో ‘పొగరు’ , తమిళ్‌లో ‘సుల్తాన్’ మూవీ చేస్తోంది రష్మిక. ఈ రెండూ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇలా మూడు హిట్స్.. ఆరు అవకాశాలు అన్నట్టు రష్మిక కెరీర్ ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. అయినప్పటికీ ఆమె చాలా ఇబ్బంది పడుతుందట.
కరోనా రాకుండా స్టార్ హీరో ఇంటికి ప్లాస్టిక్ కంచె
ఇంత సక్సెస్, స్టార్డమ్ ఉన్న నటికి ఇబ్బందులు ఏంటి? అనుకుంటున్నారా?. అందరిలాగే కరోనా కష్టాలు రష్మిక కుటుంబాన్ని తాకాయి. కొంపదీసి వాళ్ల ఫ్యామిలీలో ఎవరికైనా కరోనా సోకిందా? అన్న అనుమానం వద్దు. వాళ్ల ఫ్యామిలీ క్షేమంగానే ఉంది. కాకపోతే లాక్‌డౌన్ షూటింగ్స్ ఆగిపోవడం, వ్యాపారం కూడా దెబ్బతినడంతో తమ కుటుంబానికి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలుగుతోందని రష్మిక తెలిపింది. కరోనా వల్ల పనులన్ని ఆగిపోవడంతో తనతోపాటు తన తండ్రికి కూడా కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని చెప్పింది. అయితే, తాము కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ తమ దగ్గర పనిచేసే వాళ్లకు జీతాలు ఇస్తున్నామని తెలిపింది. తమ వద్ద 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, ఇబ్బందులు ఉన్నా వాళ్లకు మాత్రం తప్పనిసరిగా సకాలంలో జీతాలను అందిస్తున్నామని చెప్పింది. మనకు ఇబ్బంది ఉంది కదా అని ఎదుటివాళ్ళని కూడా అలాంటి ఇబ్బందికి గురి చేయకూడదు అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సెలబ్రిటీలను కూడా కరోనా ఇబ్బందులు గురి చేస్తుండగా.. ఈ కష్టకాలంలో కూడా ఉద్యోగులకు సకాలంలో వేతనం ఇస్తున్నామని చెప్పిన రష్మికను పలువురు మెచ్చుకుంటున్నారు.