https://oktelugu.com/

Sudigali Sudheer: ఆ నలుగురు భామలతో పులిహోర కలిపిన సుడిగాలి సుధీర్.. చివరికి హీరోయిన్స్ ని కూడా వదల్లేదుగా

సర్కార్ 4 హోస్టింగ్ బాధ్యతలు సుడిగాలి సుధీర్ తీసుకున్నాడు. దీంతో పాటు ఓ స్టాండప్ కామెడీ షో కూడా హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా సర్కార్ సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో లో నలుగురు హీరోయిన్స్ తో ఓ రేంజ్ లో రచ్చ చేశాడు సుధీర్.

Written By:
  • S Reddy
  • , Updated On : May 2, 2024 / 01:59 PM IST

    Sudigali Sudheer Sarkar Season 4 Latest Episode Promo

    Follow us on

    Sudigali Sudheer: ఆహాలో స్ట్రీమ్ అవుతున్న సర్కార్ షోకి ఆశించిన రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. యాంకర్ ప్రదీప్ గత మూడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించాడు. రీసెంట్ గా సర్కార్ సీజన్ 4 స్టార్ట్ చేశారు. సర్కార్ 4 హోస్టింగ్ బాధ్యతలు సుడిగాలి సుధీర్ తీసుకున్నాడు. దీంతో పాటు ఓ స్టాండప్ కామెడీ షో కూడా హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా సర్కార్ సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో లో నలుగురు హీరోయిన్స్ తో ఓ రేంజ్ లో రచ్చ చేశాడు సుధీర్.

    హీరోయిన్లు అనన్య నాగళ్ళ, గౌరి ప్రియ, శివాని, మానస చౌదరి షోకి గెస్టులుగా హాజరయ్యారు. నలుగురికి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు సుధీర్. ముందుగా గౌరీ ప్రియను ఆహ్వానించిన సుధీర్ మీరు మిస్ హైదరాబాద్ కదా అని అడిగాడు. ఆమె అవును అని సమాధానం చెప్పగానే నేను ఎలా మిస్ అయ్యాను అంటూ పంచ్ వేశాడు. ఆ తర్వాత అనన్య నాగళ్ళకు లవ్ లెటర్ ఇచ్చి ప్రపంచం అంతా వెతికా అంతకంటే గొప్ప పేరు కనిపించలేదు అంటూ పొగిడేశాడు.

    ఇక శివాని ఎంట్రీ ఇవ్వగానే మీరు బరువు పెరగనని మాటివ్వండి, అన్నాడు సుధీర్. నేను బరుపు పెరిగితే మీకు ప్రాబ్లమ్ ఏమిటని ఆమె అడిగింది. దానికి.. జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆ బరువు మోయాల్సింది నేనే కదా అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇక చివరిగా మానస చౌదరి ఎంట్రీ ఇచ్చింది. మీ ఇంటి పేరు ఏంటండీ అని మానసను అడిగాడు. ఆమె చెరుకూరి అని చెప్పగానే, అందుకేనా మీరు ఇంత స్వీట్ గా ఉన్నారు అని సుధీర్ అంటాడు. మీ ఇంటి పేరు ఏంటని మానస అడగ్గా… సుధీర్ బయానా అని బదులిచ్చాడు.

    అందుకేనా అంత భయపెడుతున్నారు అంటూ సుధీర్ కి రివర్స్ పంచ్ వేసింది. అనంతరం ఓ బీర్ బాటిల్ లో ఎంత బీర్ ఉంటుంది సుధీర్ ప్రశ్నించగా ఫుల్లా .. హాఫా అంటూ మానస చౌదరి నవ్వించింది. కాగా మే 3న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇది ఇలా ఉంటే .. అటు సినిమాల్లో సుధీర్ రాణిస్తున్నాడు. త్వరలో గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.