Hollywood: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రిస్టోఫర్ నోలన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిద్యాన్నైతే సంతరించుకుంటుంది. ముఖ్యంగా కొత్తదనం లేనిదైతే ఆయన సినిమా చేయను అని తను ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజే ఫిక్స్ అయ్యారట. ఇక అందులో భాగంగానే ఆయన చెప్పే స్టోరీలు ఎక్కువ మందికి అర్థం కానప్పటికీ అందరికీ అర్థమయ్యే రీతిలో సినిమాలు చేయండి అని కొంతమంది ప్రొడ్యూసర్స్ తనకు సలహాలు ఇచ్చారట..
అయిన కూడా తన పంథా ను ఎక్కడ మార్చుకోకుండా అర్థమయ్యేలా కాకుండా ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశ్యం తో సినిమా చూడాలి అనే ఒకే ఒక పాయింట్ తో ఆయన సినిమాలు తీస్తాడు. ఇక మొదటిసారి ఆయన సినిమాలు చూసినప్పుడు అది ఎవరికి అర్థమవ్వవు అనేది మాత్రం పక్కాగా చెప్పొచ్చు. ఇక దీనికి ఉదాహరణగా “ఇన్సెప్షన్ ” అనే మూవీ ని మనం తీసుకోవచ్చు. అయితే ఇన్సెప్షన్ మూవీ మొత్తం కలల మీద జరుగుతూ ఉంటుంది. అసలు ఏది కల ఏది నిజం అనేది కూడా మన ఊహకు అందని విధంగా తను ఒక అద్భుతమైన కథని రాసుకొని సినిమాగా తెరకెక్కించడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి..
అయితే మొదట ఈ సినిమా కొంతమందికి అర్థం కావడం లేదు అని ఒక టాక్ అయితే వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం చాలా మంది జనాలకి విపరీతంగా నచ్చింది. ఈ సినిమా కోసం 160 మిలియన్ డాలర్ల బడ్జెట్ ని కేటాయించగా ఈ సినిమా 820 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టింది… ఇక ఈ సినిమాతో నోలన్ ఒక ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి.
ఇక ఇప్పటికి కూడా ఈ సినిమాని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో సినిమాలు చూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. 2010లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి కూడా చాలామందికి ఫేవరెట్ సినిమా అనే చెప్పాలి… ప్రేక్షకులకు అర్థం కానీ సినిమాతో కూడా కలెక్షన్స్ కొల్లగొట్టొచ్చని నిరూపించిన ఒకే ఒక దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అనే చెప్పాలి…