https://oktelugu.com/

రచ్చబండే రఘురామను రచ్చకీడ్చిందా?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు వెనుక అనేక కోణాలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ కృష్ణం రాజు మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. తన ప్రభావాన్ని గుర్తించడం లేదని కృష్ణం రాజు పదే పదే వాపోయినట్లు తెలిసింది. అయినా వారిద్దరిలో గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఒకరిపై మరొకరు వ్యక్తిగత ధూషణలకు దిగే వరకు వెళ్లింది. ఇంత జరుగుతున్నా పార్టీలో పెద్ద వారిగా గుర్తింపు పొందిన వారు సైతం పట్టించుకోకపోవడంతోనే రఘురామకృష్ణం […]

Written By:
  • NARESH
  • , Updated On : May 15, 2021 5:37 pm
    Follow us on

    Krishnam Raju Arrestనరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు వెనుక అనేక కోణాలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ కృష్ణం రాజు మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. తన ప్రభావాన్ని గుర్తించడం లేదని కృష్ణం రాజు పదే పదే వాపోయినట్లు తెలిసింది. అయినా వారిద్దరిలో గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఒకరిపై మరొకరు వ్యక్తిగత ధూషణలకు దిగే వరకు వెళ్లింది. ఇంత జరుగుతున్నా పార్టీలో పెద్ద వారిగా గుర్తింపు పొందిన వారు సైతం పట్టించుకోకపోవడంతోనే రఘురామకృష్ణం రాజుపై వేటు పడినట్లు తెలుస్తోంది.

    తానే పెద్ద నాయకుడిగా..
    పార్టీలో తానే పెద్ద నాయకుడిగా ప్రకటించుకున్న కృష్ణంరాజు పలు విధాలుగా పార్టీ నియమాలను ధిక్కరించారు. తానే పెద్ద నాయకుడిగా భావించారు. సీఎం జగన్ ను సైతం ఏక వాక్యంతో సంభోదిస్తూ సభా మర్యాదలు పాటించలేదు. దీంతో మెల్లమెల్లగా ఇద్దరి మధ్య దూరం పెరిగి కేసుల వరకు వెళ్లింది. పార్టీకి విధేయుడిగా ఉండాల్సిన కృష్ణం రాజు తనదైన ధోరణి వినిపించారు. పైగా బీజేపీ నేతలతో కలివిడిగా ఉంటూ పార్టీ నిబంధనలను తుంగలో తొక్కారు. పర్యవసానంగా పార్టికి తలవంపులు తెచ్చారు. దీంతో జగన్, కృష్ణం రాజుల మధ్య అగాధం పెరిగింది.

    అనర్హత వేటు వేయాలని..
    కృష్ణం రాజు వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు విన్నవించారు. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. పార్టీ అధినేత జగన్ పైనే విమర్శలు చేసే కృష్ణం రాజును పార్టీ నుంచి సాగనంపాలని తెలిపారు. దీంతో కృష్ణం రాజు వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేసు పెట్టించి అరెస్టు చేయించినట్లు భావిస్తున్నారు.

    దిగజారిపోయి..
    రఘురామ కృష్ణంరాజు క్షత్రియ వర్గానికి చెందిన వాడైనా ఆ స్థాయి మరిచిపోయి వ్యక్తిగత ధూషణలకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ కు కోపమొచ్చి ఆయన అరెస్టుకు పూనుకున్నారు. ముఖ్యమంత్రిపైనే సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడంతో జగన్ కు సహనం కోల్పోయారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు రచ్చబండ కబుర్ల పేరుతో ప్రజల్లోకి వెళ్లడంతోనే ఆయన అరెస్టు జరిగిందని పలువురు విశ్లేషిస్తున్నారు.