Subham Movie : నిర్మాతగా ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) మొదటి సినిమాతోనే సిక్సర్ కొట్టేసింది అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు. కొత్తవాళ్లతో కొత్త తరహా సినిమాలు చేసే ఆలోచనతో ఆమె ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో ఒక సంస్థని స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఆమె నిర్మించిన ‘శుభమ్'(Subham Movie) చిత్రం ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని న్రిమించడానికి సమంత కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ ని మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఆమె ఒక యాడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్ కంటే తక్కువ అన్నమాట. అంతటి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుండే ట్రేడ్ ని సర్ప్రైజ్ కి గురి చేసే వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 2 కోట్ల 80 లక్షల రూపాయలకు జరిగింది.
Also Read : 5వ రోజు చరిత్ర సృష్టించిన శ్రీవిష్ణు ‘సింగల్’..ఎంత గ్రాస్ రాబట్టిందంటే!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం కేవలం 5 రోజుల్లోనే 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో బయ్యర్స్ అందరూ పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని పొంది లాభాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. హీరో హీరోయిన్ల పేర్లు జనాలకు పెద్దగా తెలియవు. ఇలాంటి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్ కి కదిలి చూడడం అసాధ్యం. ఎందుకంటే ఓటీటీ లకు అలవాటు పడిన జనం, ఓటీటీ లోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనే ధోరణితో ఉంటారు. కానీ ఈ బుల్లి సినిమా ఆ విఘాతం ని ఎదురుకొని బ్రేక్ ఈవెన్ స్టేటస్ కి అతి దగ్గరగా వచ్చిందంటే, అందుకు కారణం ముమ్మాటికీ సమంత బ్రాండ్ ఇమేజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల నుండి కలెక్షన్స్ ఎలా అయినా వచ్చేస్తాయి, కానీ ఓవర్సీస్ లో ఇలాంటి చిన్న సినిమాల వైపు ఆడియన్స్ కన్నెత్తి కూడా చూడరు.
అక్కడ ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు లక్షల డాలర్లకు జరిగింది. 5 రోజుల్లో కేవలం నార్త్ అమెరికా నుండి లక్షా 85 వేల డాలర్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని ఓవర్సీస్ లో కూడా దాటనుంది ఈ చిత్రం. ఇక డిజిటల్ రైట్స్ 5 కోట్ల రూపాయలకు, సాటిలైట్ రైట్స్ మరో 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అలా విడుదలకు ముందే 10 కోట్ల రూపాయిల లాభాలను అందుకున్న సమంత, విడుదల తర్వాత థియేటర్స్ నుండి మరో మూడు కోట్ల రూపాయిల లాభాలను అందుకుంది. అలా కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో దాదాపుగా 13 కోట్ల రూపాయిల లాభాలను మూటగట్టుకుంది సమంత. ఇలా చిన్న సినిమాల ఫార్ములా అందరి హీరోలకు, హీరోయిన్స్ కి కుదిరినట్టు, సమంత కి కూడా కుదిరేసింది. భవిష్యత్తులో ఆమె నిర్మాతగా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.
Also Read : అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!