Premanand Ji Maharaj : సినిమా వాళ్ళు గాని, క్రికెటర్లు గాని ఏం చేసినా కూడా అదొక సెన్సేషన్ అవుతుంది. వాళ్ళు ఎవరిని కలిశారు, ఎవరితో మాట్లాడారు లాంటి విషయాలను తెలుసుకోవడానికి జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు…ఇక విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే ఆయన తన సతీమణి అనుష్క శర్మ తో ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ దామ్ ను సందర్శించారు. ఆధ్యాత్మిక మహా గురువు అయిన ప్రేమానంద్ జీ మహారాజ్ ను కలిశారు…
Also Read : జట్టు పై పట్టు చిక్కినట్టే.. గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడో మరి..
కోహ్లీ దంపతులు ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయనతో దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు…ప్రేమానంద్ జీ ని చాలా మంది బాలీవుడ్ సెలబ్రేటీస్ కలుస్తూ ఉంటారు…హీరోలు, క్రికెటర్లు ఆయన్ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం చూస్తున్న చాలా మంది జనాలకు వాళ్ల మైండ్ లో ఒక ప్రశ్న అయితే మెదులుతూ ఉంటుంది…ఇంతకీ ఈ గురువు ఎవరు..ఆయన అంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలని చాలా మంది జనాలు ఆసక్తి చూపిస్తున్నారు… ఆయన ఎవరో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ప్రేమానంద్ జీ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించాడు… చిన్నప్పుడు ఆయనను అనిరుధ్ కుమార్ పాండే అని పిలిచేవారు.. శంభు పాండే,రమాదేవి అనే దంపతులకు జన్మించాడు… చిన్నతనం నుంచి కూడా ఆయనను పేరెంట్స్ భక్తి భావంతో పెంచడమే కాకుండా దైవం మీద ప్రేమతో పెంచారు…ప్రేమానంద్ వాళ్ల తాతయ్య సన్యాసం తీసుకున్నారు…వాళ్ళ తండ్రి కూడా దేవుడంటే అపారమైన నమ్మకం…అన్నయ్య కూడా భగవత్ పారాయణం చేస్తూ ఉండేవాడు…వీళ్ళందరి మధ్య పెరిగాడు కాబట్టి ఆయనకి కూడా దైవం మీద భక్తి పెరిగింది…తను చిన్న తనం నుంచే భగవత్ పారాయణం చేస్తు పెరగడం వల్లే సాధువుగా మారాలని నిర్ణయించుకున్నారట…అందుకే ఇంటిని వదిలి వారణాసి కి వెళ్ళి సన్యాసి గా మారను అని చెప్పాడు…
అలాగే రోజు గంగా నదిలో స్నానం చేసి గంగ తల్లిని పూజించేవారు…ఇక అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళిన తర్వాత రాధ వల్లభ శాఖలో కూడా చేరారు…శ్రీ గౌరంగి శ్రవణ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రేమానంద్ మహారాజ్ తన భావనల ద్వారా రాధ కృష్ణుల ప్రేమను వివరిస్తూ వచ్చారు…ఇక ప్రేమానంద్ మహా గురువుగా మారిన తర్వాత మనిషికి వచ్చే కష్టాలను ఎలా ఎదురించి నిలబడాలి. ఎంత సరళమైన పద్ధతిలో బతకాలి అనే విషయాలను ప్రజలకు బోధిస్తూ ఉంటారు…ఇక ఆయన ను కలిసిన ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ వల్ల జీవితంలో వచ్చిన కష్టాలను మర్చిపోతారు అందువల్లే సెలబ్రిటీస్ సైతం ఆయన దగ్గరికి వెళ్తూ తన దగ్గర ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు…ఇక టాప్ సెలబ్రిటీస్ అయిన విరాట్ కోహ్లీ అనుష్క శర్మ , విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్ లాంటి వాళ్ళు ఎన్ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు…
Also Read : శుభమ్’ కి పెట్టిన బడ్జెట్ 2 కోట్లు..5 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే!