Kesari Chapter 2: ఈమధ్య కాలం లో ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి సరమణమైన పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకున్న చిత్రం ‘కేసరి: చాప్టర్ 2′(Kesari : Chapter 2). బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అక్షయ్ కుమార్(Akshay Kumar), మాధవన్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ని చూసి కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని నెలకొల్పుతుందని అంతా అనుకున్నారు. కానీ కనీసం వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. అక్షయ్ కుమార్ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం వల్ల ఆ ప్రభావం దీనిపైనా పది ఉండొచ్చని, అందుకే కలెక్షన్స్ రాలేదని విశ్లేషకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 150 కోట్ల కంటే తక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read: ‘ఓజీ’ సెట్స్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్..కానీ ఆ విషయంలో పెద్ద మార్పు?
అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు లోకి అనువదించారు. తెలుగు వెర్షన్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, మరియు ది స్పిరిట్ సంస్థలు కొనుగోలు చేశారు. ఈ నెల 23 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు వెర్షన్ ని విడుదల చేయబోతున్నారు. మన భారతదేశ చరిత్రలో పూడ్చేసిన కొన్ని నిజాలను వెలికి తీసి, న్యాయం చేసే పాత్రలో ఇందులో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడు. ఒక విధంగా చెప్పాలంటే తన నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. పాజిటివ్ రివ్యూస్ నాన్ స్టాప్ గా సోషల్ మీడియా లో వస్తూనే ఉండడం తో మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని తెలుగు లోకి డబ్ చేసి విడుదల చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళ కోరిక మేరకు ఈ సినిమా ఎట్టకేలకు మన ముందు ఈ నెల 23న రాబోతుంది.
సినిమా ఫలితాన్ని కాసేపు పక్కన పెడితే ప్రతీ ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మన చరిత్ర గురించి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు స్పష్టం గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటోళ్లకు ఈ చిత్రం చాలా బలంగా ఉపయోగపడుతుంది. హిందీ లో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, తెలుగు లో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం అక్షయ్ కుమార్ జాక్పాట్ కొట్టినట్టే. సురేష్ బాబు ఒక సినిమాని అంత తేలికగా కొనుగోలు చేయడు. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మనకు వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తేనే కొనుగోలు చేస్తాడు. అలాంటి నిర్మాత కొన్నాడు కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం తెలుగు లో వర్కౌట్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.
Also Read: పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచడం వెనక ఉన్న కారణం ఏంటంటే..?