https://oktelugu.com/

Subbaraju Marriage: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ సినీ నటుడు సుబ్బరాజు..పెళ్లి కూతురు ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు!

'జితేందర్ రెడ్డి' అనే సినిమాలో తప్ప, ఈ ఏడాది ఈయన ఏ సినిమాలోనూ కనిపించలేదు. అవకాశాలు బాగా తగ్గిపోయాయి ఏమో అని అందరూ అనుకున్నారు కానీ, ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా గడపడం కోసం గ్యాప్ ఇచ్చాడని నిన్ననే తెలిసింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 27, 2024 / 09:54 AM IST

    Subbaraju Marriage(1)

    Follow us on

    Subbaraju Marriage: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకడు సుబ్బరాజు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ చిత్రం ద్వారా ఈయన వెండితెర అరంగేట్రం చేసాడు. మొదటి సినిమానే పెద్ద హిట్టై మంచి పేరు తీసుకొని రావడంతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం దక్కింది. ముఖ్యంగా బాహుబలి సిరీస్ లో ఈయన పోషించిన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈయనకి గుర్తింపు రావడమే కాకుండా, ఫ్యాన్ బేస్ ని కూడా తెచ్చిపెట్టింది. ఇలా క్యారక్టర్ ఆర్టిస్ట్స్ విషయం లో చాలా అరుదుగా జరుగుతుంది. ఏడాదికి కనీసం 10 సినిమాల్లో కనిపించే సుబ్బరాజు, ఈ ఏడాది మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చాడు.

    ‘జితేందర్ రెడ్డి’ అనే సినిమాలో తప్ప, ఈ ఏడాది ఈయన ఏ సినిమాలోనూ కనిపించలేదు. అవకాశాలు బాగా తగ్గిపోయాయి ఏమో అని అందరూ అనుకున్నారు కానీ, ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా గడపడం కోసం గ్యాప్ ఇచ్చాడని నిన్ననే తెలిసింది. సుమారుగా 47 ఏళ్ళ వయస్సు ఉన్న సుబ్బరాజు నిన్ననే వివాహం చేసుకున్నాడు. పెళ్లి కూతురు కి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియదు కానీ, గత రెండేళ్ల నుండి సుబ్బరాజు ఆమెతో ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేసుకొని, ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నిన్న కుటుంబ సభ్యుల సమక్ష్యం లో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా సుబ్బరాజు కి టాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు, అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. అలా ఇన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ క్యాటగిరీలో ఉన్నటువంటి సుబ్బరాజు, నిన్నటితో తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పేసాడు.

    సుబ్బరాజు భీమవరం కి చెందిన కుర్రాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ వంటి వారు సుబ్బరాజు కి భీమవరం లో ఉన్న రోజుల్లోనే బాగా పరిచయం. సుబ్బరాజు తండ్రి గారు టీచర్ గా పనిచేసేవారు. ఈయన నిర్వహించే ట్యూషన్ కి త్రివిక్రమ్ అప్పట్లో తరుచూ వచ్చేవాడట. సుబ్బరాజు ఇండస్ట్రీ లోకి రావాలని మక్కువ చూపిస్తున్న విషయాన్నీ తెలుసుకున్న ఆయన తండ్రి త్రివిక్రమ్ కి ఫోన్ చేసి, కాస్త మావాడిని చూసుకోమని చెప్పాడట. అయితే హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో సుబ్బరాజు త్రివిక్రమ్ ని కలిసేందుకు చాలా మొహమాటం చూపించేవాడట. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని త్రివిక్రమ్ ని కలిసాడు సుబ్బరాజు. అలా ఆయన ప్రోత్సాహం తో ఇండస్ట్రీ లో కృష్ణ వంశీ వద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసేవాడిగా కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వం ద్వారానే తొలిసారి వెండితెర మీద కనిపించాడు.