https://oktelugu.com/

AP Mega DSC: మెగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో నోటిఫికేషన్‌.. వెబ్‌సైట్‌లో సిలబస్‌!

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఏసీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 27, 2024 / 10:02 AM IST

    AP Mega DSC

    Follow us on

    AP Mega DSC: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే పెట్టారు. దీంతో ఐదు నెలలుగా ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే(నవంబర్‌ 4న) టెట్‌ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. దీంతో డీఎస్సీ నిర్వహణకు మార్గం సుగమమైంది. దీంతో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.

    సిలబస్‌ ప్రకటన..
    డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తాజాగా ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో నోటిఫికేషన్‌రాబోతుందని సంకేతం ఇచ్చింది. ఈమేరకు ఉపాధ్యాయ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌నువిడుదల చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా మెగా డీఎస్సీ సిలబస్‌ను నవంబర్‌ 27న ఉదయం 11 గంటలకు ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు. అభ్యర్థులు సిలబస్‌ను https://apdsc2024.apcfss.in/ వెబ్సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌చేసుకోవచ్చు.

    డిసెంబర్‌లో నోటిఫికేషన్‌..
    ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దరఖాస్తులకు నెలరోజులపాటు సమయం ఇచే ్చ అవకాశం ఉంది. అంటే జనవరి వరకు దరఖాస్తులు స్వీకరించి ఫిబ్రరిలో రాత పరీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. మార్చిలో ఫలితాలు వెల్లడించి ఏప్రిల్‌ లేదా మే నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు.

    16వేలకుపైగా పోస్టులు..
    ఇక మెగా డీఎస్సీలో 16,347 పోస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఎస్జీటీ పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 7,725, టీజీటీలు 1, 781 పోస్టులు, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపాల్‌ పోస్టులు 52, పీఈటీ పోస్టులు 132 ఉన్నట్లు సమాచారం. ఈమేరకు విద్యాశాఖ ఖాళీల జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. నోటిఫికేషన్‌ నాటికి పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉంది.

    టెట్‌లో 50.79 శాతం అర్హత..
    ఇదిలా ఉంటే.. ఇటీవల నిర్వహించిన ఏపీ టెట్‌ ఫలితాలను విద్యాశాఖ నవంబర్‌ 6న విడుదల చేసింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3,68,661 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,87,256 మంది(50.79 శాతం) అర్హత సాధించారు.