https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టాప్ 5 నుండి విన్నర్ రేసులోకి దూసుకొచ్చిన రోహిణి..నబీల్ టాప్ 5 కూడా కష్టమేనా..ఈ వారం ఓటింగ్ లో డేంజర్ జోన్?

నామినేషన్స్ లోకి వచ్చి మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల సేవ్ అవుతాడు. తనకి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటూ గౌతమ్ తన ఆట తీరు మొత్తాన్ని మార్చుకొని, గేమ్ లో వేరే లెవెల్ ఇంప్రూవ్మెంట్ ని చూపించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 27, 2024 / 09:36 AM IST

    Bigg Boss Telugu 8(252)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఇంతకు ముందు సీజన్స్ లో బిగ్ బాస్ టైటిల్ ని ఎవరు గెలవబోతున్నారు అనేది, 7 వారాలు తర్వాత ప్రేక్షకులకు, విశ్లేషకులకు పూర్తిగా అర్థం అయ్యేది. కానీ ఈ సీజన్ లో మాత్రం టైటిల్ ఎవరు గెలవబోతున్నారు అనేది 12 వారాలు పూర్తి అయినా కూడా కనిపెట్టలేకపోతున్నారు ఆడియన్స్. ఆ రేంజ్ లో విన్నర్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కి ప్రతీ వారం ఓటింగ్ లో వస్తున్న మార్పులు ఊహించని విధంగా ఉన్నాయి. ఇంతకుముందు ఏ సీజన్ లో కూడా ఈ స్థాయి మార్పులు రాలేదు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కి ముందు నిఖిల్, నబీల్ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు టైటిల్ కొడుతారు అని అనుకున్నారు. ఓటింగ్ కూడా అదే స్థాయిలో వీళ్లిద్దరి మధ్య హోరాహోరీగా ఉండేది. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

    నామినేషన్స్ లోకి వచ్చి మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల సేవ్ అవుతాడు. తనకి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటూ గౌతమ్ తన ఆట తీరు మొత్తాన్ని మార్చుకొని, గేమ్ లో వేరే లెవెల్ ఇంప్రూవ్మెంట్ ని చూపించాడు. ఫలితంగా ఆయన టాప్ 5 లో ఉండడం కాదు, ఏకంగా టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చాడు. పరిస్థితి చూస్తుంటే గౌతమ్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతీ వారం ఆయన గ్రాఫ్ పెరుగుతూ పోతుంది. అయితే ఇప్పుడు టైటిల్ రేస్ లో కేవలం గౌతమ్, నిఖిల్ మాత్రమే కాదు, రోహిణి కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గత వారం రోహిణి టాస్కులు మామూలు రేంజ్ లో ఆడలేదు. గత వారం టాస్కులలో ఆమె గెలుపు, బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక చరిత్ర. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈమెకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు.

    ఓట్లు కళ్ళు మూసుకొని గుద్దేస్తున్నారు. కాబట్టి ఈమె కూడా టైటిల్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నబీల్ విషయానికి వస్తే రోహిణి అతని స్థానాన్ని ఆక్రమించేసుకుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గ్రాఫ్ మొత్తం పడిపోయింది, టాప్ 5 లో అయినా ఉంటాడా అంటే అనుమానమే.. ఈ వారం టికెట్ టు ఫినాలే ఎవరైనా గెలిచి టాప్ 5 లోకి వెళ్తే నబీల్ రిస్క్ లో పడినట్టే. ఎందుకంటే ప్రేరణ కి నబీల్ కంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఈయనకంటే ఆమెకే టాప్ 5 లో ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు, నబీల్ టాప్ 4 లో ఉన్నాడు కదా, ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవుతాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నబీల్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నాడట. కాబట్టి ఆయన అభిమానులు లైట్ తీసుకోకుండా ఓట్లు వెయ్యండి.