Stree 2 OTT: బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ట్రేడ్ పండితులను కూడా షాక్ కి గురి చేసేలా, అద్భుతమైన వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని దంచికొడుతున్న చిత్రం ‘స్త్రీ2’. ఇప్పటికే ఈ చిత్రం బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టుకుంటూ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ దిశగా ముందుకు అడుగులు వేస్తుంటే, మరోపక్క ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతూ మేకర్స్ ని కంగారు పెడుతుంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, ఈ చిత్రం అక్టోబర్ 22 వ తారీఖున ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పుడు సూపర్ హిట్ అవ్వడం తో, ముందు ఒప్పందం చేసుకున్న తేదీ కంటే, తొందరగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసుకోవడానికి అవకాశం ఇస్తే, మరో 40 కోట్ల రూపాయిల అదనంగా ఇస్తామని ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టారట. దీనికి అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం అయితే, ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చెయ్యాలి. కానీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో అమెజాన్ ప్రైమ్ ఈ రేంజ్ ఆఫర్ తో మేకర్స్ ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు మేకర్స్ కి కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే వంద కోట్ల రూపాయిల వచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ‘స్త్రీ2’ రేపటితో రెండు వారాలు పూర్తి చేసుకోనుంది. ఈ రెండు వారాల్లో ఈ చిత్రం దాదాపుగా 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లకు అతి దగ్గరగా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఈ స్థాయిలో షేక్ చెయ్యడం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. బాలీవుడ్ లో మొదటి నుండి సీక్వెల్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది.
ఆ క్రేజ్ కి తగ్గట్టు సినిమా ఉంటే కనీవినీ ఎరుగని వసూళ్లు ఇస్తుంటారు బాలీవుడ్ ఆడియన్స్. అందుకు ఉదాహరణలు ‘బాహుబలి 2’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమా వసూళ్లను ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ మాత్రమే దాటాడు. ఆయన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ రెండు సినిమాలు కూడా బాహుబలి 2 ని దాటాయి. ఇవి రెండు కాకుండా, బాహుబలి 2 ని ఈ వారం లో దాటబోతుంది ‘స్త్రీ 2’. బాహుబలి హీరో ప్రభాస్ తో కలిసి ‘స్త్రీ 2’ లో ప్రధాన పాత్ర పోషించిన శ్రద్దా కపూర్ ‘సాహూ’ చిత్రంలో నటించడం మరో విశేషం.