Meelo Evaru Koteeswarudu: త్వరలోనే మన ముందుకు రాబోతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్ 6..ఈసారి హోస్ట్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!

నాల్గవ సీజన్ మెగాస్టార్ చిరంజీవి తో చేయగా, ఆ సీజన్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షో కి కొన్నేళ్లు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఈ గేమ్ షో 'స్టార్ మా' ఛానల్ నుండి 'జెమినీ' కి మారింది.

Written By: Vicky, Updated On : August 28, 2024 9:31 pm

Meelo Evaru Koteeswarudu

Follow us on

Meelo Evaru Koteeswarudu: హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కౌన్ బనేగా కరోద్ పతి’ అనే క్విజ్ గేమ్ షో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో ఇక అమితాబ్ బచ్చన్ పని అయిపోయింది అని అనుకున్న ప్రతీ ఒక్కరికి చెంప దెబ్బ లాగా నిల్చింది ఈ షో. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ క్విజ్ గేమ్ షో, ఇప్పటి వరకు అనేక సీజన్స్ గా ప్రతీ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. ఈ షో ఆ స్థాయిలో విజయం సాధించడంతో స్టార్ మా ఛానల్ లో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ‘ ఎవరు మీలో కోటీశ్వరుడు’ అనే పేరుతో ప్రారంభం అయ్యింది. మొదటి సీజన్ బంపర్ హిట్ అవ్వడంతో అక్కినేని నాగార్జున తో స్టార్ మా యాజమాన్యం మూడు సీజన్స్ చేసింది. మూడు కూడా ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యాయి.

ఇక నాల్గవ సీజన్ మెగాస్టార్ చిరంజీవి తో చేయగా, ఆ సీజన్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో కి కొన్నేళ్లు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఈ గేమ్ షో ‘స్టార్ మా’ ఛానల్ నుండి ‘జెమినీ’ కి మారింది. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ పేరుతో మొదలైన సీజన్ సూపర్ హిట్ అయ్యింది. 2021 వ సంవత్సరంలో టెలికాస్ట్ అయిన ఈ సీజన్ తో జెమినీ టీవీ టీఆర్ఫీ రేటింగ్స్ లో మళ్ళీ టాప్ రేస్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సీజన్ 6 కోసం జెమినీ టీవీ గ్రాండ్ గా ప్లాన్ చేయబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సీజన్ కి సంబంధించిన సెట్ వర్క్స్ కూడా మొదలు పెట్టారట. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ లో రామ్ చరణ్, మహేష్ బాబు , సమంత, కొరటాల శివ, రాజమౌళి వంటి టాప్ సెలెబ్రిటీలు అతిధులుగా విచ్చేసారు. వారితో ఎన్టీఆర్ జరిపిన చిట్ చాట్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సీజన్ కూడా ఆ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఎన్టీఆర్ లో మంచి యాంకరింగ్ స్కిల్స్ ఉండడంతో పాటు, జెమినీ టీవీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కారణంగానే మళ్ళీ టాప్ రేస్ లోకి వచ్చినందున, మళ్ళీ ఆయనతో చేస్తేనే ఈ సీజన్ కూడా హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ వచ్చే నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.