Comedian Satya: షాకింగ్..కమెడియన్ సత్య ఒక రోజు షూటింగ్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఏవీఎస్, ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు దురదృష్టం కొద్దీ నేడు మన మధ్య లేరు. ఇక బ్రహ్మానందం ఒకప్పటి రేంజ్ లో ఇప్పుడు సినిమాలు చెయ్యడం లేదు, బాగా తగ్గించేసాడు. అలీ క్రేజ్ కూడా బాగా పడిపోయింది, ఇక సునీల్ అయితే కమెడియన్ నుండి హీరో గా మారి, ఇప్పుడు హీరో నుండి విలన్ గా మారిపోయాడు. దీంతో ఇండస్ట్రీ కమెడియన్స్ కొరత ఏర్పడింది.

Written By: Vicky, Updated On : August 28, 2024 9:42 pm

Comedian Satya

Follow us on

Comedian Satya: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్నంత కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో కూడా ఉండరని అందరూ అంటూ ఉంటారు. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, సుధాకర్, సునీల్, అలీ, ఏవీఎస్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా ఎందరో లెజెండ్స్ ఉన్నారు. కేవలం వీళ్ళు ఉన్నారనే కారణంతోనే థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ లెజండరీ కమెడియన్స్. అయితే వీరిలో ఏవీఎస్, ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు దురదృష్టం కొద్దీ నేడు మన మధ్య లేరు. ఇక బ్రహ్మానందం ఒకప్పటి రేంజ్ లో ఇప్పుడు సినిమాలు చెయ్యడం లేదు, బాగా తగ్గించేసాడు. అలీ క్రేజ్ కూడా బాగా పడిపోయింది, ఇక సునీల్ అయితే కమెడియన్ నుండి హీరో గా మారి, ఇప్పుడు హీరో నుండి విలన్ గా మారిపోయాడు. దీంతో ఇండస్ట్రీ కమెడియన్స్ కొరత ఏర్పడింది.

అలాంటి సమయంలో వెన్నెల కిషోర్ వచ్చాడు. తనదైన శైలి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత కొంత కాలానికి వెన్నెల కిషోర్ కి పోటీ గా కమెడియన్ సత్య వచ్చాడు. ప్రస్తుతం సత్య క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్రహ్మానందం, సునీల్ వంటి కమెడియన్స్ ముఖం చూడగానే మనకి ఎలా అయితే నవ్వు వస్తుందో, కమెడియన్ సత్య ని చూసినప్పుడు కూడా అదే విధమైన నవ్వు వస్తుంది. మామూలుగా ఉన్న సన్నివేశాన్ని కూడా సత్య తన కామెడీ టైమింగ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సత్య లేని సినిమా అంటూ ఏది లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన డేట్స్ కోసం స్టార్ హీరోల దగ్గర నుండి, స్టార్ డైరెక్టర్స్ వరకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ఫ్లాప్ చిత్రం లో కూడా హైలైట్ నిల్చింది ఏదైనా ఉందా అంటే అది సత్య కామెడీ నే.

అలాగే సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ప్రోమో కోసం కూడా సత్య ని వాడుకున్నారు. ఈ ప్రోమోలో కూడా సత్య తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేసాడు. మరి ఇంత డిమాండ్ ఉన్న సత్య, రెమ్యూనరేషన్ విషయం లో కూడా తగ్గడు కదా. అందుకే ఆయన ఒక్క రోజు కాల్ షీట్ ఇవ్వడానికి నిర్మాతలను రెండు లక్షల రూపాయిల అడుగుతున్నాడట. అంటే నెల రోజులు ఆయన ఒక సినిమా కోసం పనిచేస్తే 60 లక్షలు ఇవ్వాలి అన్నమాట. జబర్దస్త్ లో కమెడియన్ గా రాణించిన సత్య నేడు ఇండస్ట్రీ లో రోజుకి రెండు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.