https://oktelugu.com/

ఏకగ్రీవం వైపు అడుగులు: విష్ణు ఒప్పుకుంటాడా..?

ఈసారి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కేవలం సినీ ఇండస్ట్రీకి మాత్రమే తెలిసే ఈ ఎన్నికల్లో ఈసారి అధ్యక్ష పదవి కోసం 5 గురు అభ్యర్థులు బరిలో ఉండడంతో ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ ఉంటుందని అంటున్నారు. మిగతా నరేశ్ వర్గం కూడా పోటీ ఇవ్వనుంది. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో లొసుగులు ఉన్నాయని ఈసారి తమకు ఇస్తే సరిదిద్దుతామని ఎవరికి వారే ప్రచారం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 5, 2021 / 02:37 PM IST
    Follow us on

    ఈసారి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కేవలం సినీ ఇండస్ట్రీకి మాత్రమే తెలిసే ఈ ఎన్నికల్లో ఈసారి అధ్యక్ష పదవి కోసం 5 గురు అభ్యర్థులు బరిలో ఉండడంతో ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ ఉంటుందని అంటున్నారు. మిగతా నరేశ్ వర్గం కూడా పోటీ ఇవ్వనుంది. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో లొసుగులు ఉన్నాయని ఈసారి తమకు ఇస్తే సరిదిద్దుతామని ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇలా కాకుండా ఈసారి ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే ఎలాంటి సమస్య ఉండదని సినీ పెద్దలు ఆలోచిస్తున్నారట.

    అయితే ప్రధాన పోటీదారులైన మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మధ్య పోటీ ఉండడంతో వీరిని కూర్చోబెట్టి మాట్లాడాలని సీనీ పెద్దలైన మురళీమోహన్, చిరంజీవి ఆలోచిస్తున్నారట. అయితే వీరిలో విష్ణును ఒప్పించాలని అనుకుంటున్నారట. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ సినీ ఇండస్ట్రీలోని సినియర్తో పాటు అనుభవం కూడా ఉంది. అవసరమైతే వచ్చేసారి విష్ణును ఏకగ్రీవం చేయాలని అనుకుంటున్నారట. అయితే అందుకు విష్ణు ఒప్పుకుంటాడా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

    ఇక నరేశ్ వర్గం మాత్రం వేరే ఆలోచిస్తోందట. గత ఎన్నికలు జరిగినప్పుడే ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించార. అందులో భాగంగా జీవితకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అవసరమనుకుంటే ఈసారి జీవితకు అవకాశం ఇచ్చి వచ్చేసరికి ప్రకాశ్ రాజ్ కు అవకాశం ఇద్దామంటున్నారు. అలా అయితే విష్ణు మరో నాలుగేళ్లపాటు వెయిట్ చేయాల్సి వస్తోంది.

    ఇలా ఎవరికి వారే అన్న తీరులో ఉండడంతో సీనీ పెద్దలంతా ఒక్కటిగా మారి చర్చలు జరుపుతున్నారు. ఎవరిని ఒప్పిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారట. గతంలో మా ఎన్నికలంటే సాధారణ ప్రజానీకానికి తెలిసేది కాదు. కానీ ఈసారి పోటీ ఎక్కువగా ఉండడంతో రచ్చకెక్కాయి. అయితే సీనియర్ నటులు మాత్రం ఈ వివాదాన్ని ఏకగ్రీవంతో సమం చేయాలని అనుకుంటున్నారట.