https://oktelugu.com/

వైవాహిక జీవితంపై స్పందించిన నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక. ఆమె పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించారో మనం చూశాం. అంగరంగ వైభవంగా జరిపారు. పెళ్లి అయిన తర్వాత కూడా నిహారిక ఇంకా యాక్టివ్ గానే ఉంటూ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇక తన భర్తతో, కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక తాజాగా నిహారిక ఇన్ స్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది. ఇందులో ఫాలో వర్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 5, 2021 / 01:51 PM IST
    Follow us on

    మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక. ఆమె పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించారో మనం చూశాం. అంగరంగ వైభవంగా జరిపారు. పెళ్లి అయిన తర్వాత కూడా నిహారిక ఇంకా యాక్టివ్ గానే ఉంటూ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

    ఇక తన భర్తతో, కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక తాజాగా నిహారిక ఇన్ స్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది. ఇందులో ఫాలో వర్లు అడిగిన వింత ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.

    అయితే ఓ తుంటరి నెటిజన్ ‘నిహారిక’కు అరుదైన ప్రశ్న వేశాడు. ‘మీ వైవాహితక జీవితం ఎలా ఉంది?’ అంటూ ప్రశ్న అడిగాడు. దీనికి అంతే తుంటరిగా నిహారిక సమాధానం ఇచ్చింది.

    తన భర్త చైతన్య కళ్లు మూసిన ఫొటోను షేర్ చేస్తూ ‘ఏమో సార్ నాకు కనపడదు’ అంటూ ఊహించని రీతిలో ఘాటు సమాధానం ఇచ్చింది. ఇప్పుడు నిహారిక ఇచ్చిన సమాధానం తాలూకూ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.