Hemachandra- Sravana Bhargavi: సంగీత ప్రియులకు హేమచంద్ర, శ్రావణ భార్గవి పరిచయం అక్కర్లేని పేర్లు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ సింగర్స్ విడాకులకు సిద్దమయ్యారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వారి ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. టాలీవుడ్ లో విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి. పుకార్లుగా మొదలవుతున్న ఈ వార్తలు నిజం కావడం ఆందోళన కలిగిస్తుంది. సమంత, నాగ చైతన్య అధికారికంగా విడాకులు ప్రకటించక ముందే మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పుకార్లు మొదలైన మూడు నాలుగు నెలల తర్వాత 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా సమంత, చైతు విడాకుల ప్రకటన చేశారు.
అలాగే టాలీవుడ్ లో మరో సెలెబ్రిటీ జంటపై విడాకుల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఖండించలేదు. అయితే కళ్యాణ్ దేవ్, శ్రీజ వేరువేరుగా ఉంటున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన కళ్యాణ్ దేవ్ చిత్రాలకు మెగా హీరోల సపోర్ట్ దక్కడం లేదు. ఈ క్రమంలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకుల వార్తలను ఖండించలేం అంటున్నారు. తాజాగా మరో జంట విడిపోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి.
Also Read: Rajendra Prasad’s Son: షాకింగ్..రాజేంద్రప్రసాద్ కొడుకు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమ చంద్ర, శ్రావణ భార్గవి మధ్య మనస్పర్థలు తలెత్తాయట. ఈ జంట విడిపోవాలని అనుకుంటున్నారనేది లేటెస్ట్ న్యూస్.ప్రస్తుతం వీరు విడివిడిగా ఉంటున్నారట. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు విడిపోవడం ఏమిటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హేమచంద్ర, శ్రావణ భార్గవి సింగింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తర్వాత హేమచంద్ర ప్లేబ్యాక్ సింగర్ గా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతున్నారు. శ్రావణ భార్గవి సైతం సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.
2013లో హేమచంద్ర-శ్రావణ భార్గవి వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. తరచుగా బుల్లితెర షోస్ లో ఈ జంట కలిసి సందడి చేస్తారు. అందమైన, అన్యోన్యమైన భార్యాభర్తలుగా పేరు తెచ్చుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకొని నడుచుకునే ఈ దంపతులు విడిపోవడం నిజం కాదు, ఈ వార్తలు పుకార్లు మాత్రమేనని కొందరు వాదిస్తున్నారు. అలాగే ఈ అందమైన జంట విడిపోకూడదని కోరుకుంటున్నారు. ఇక ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read:Draupadi Murmu Nomination: నేడే ద్రౌపది ముర్ము నామినేషన్.. వైసీపీ మద్దతు వారికే
Recommended Videos