https://oktelugu.com/

KartheekaDeepam: కార్తీకదీపం సీరియల్ కథ ముగిసినట్టేనా.. టీఆర్పీ రేటింగ్ అంత ఘోరమా?

KartheekaDeepam: బుల్లితెరపై ప్రసారమైన సీరియళ్లలో చాలా సీరియళ్లు సక్సెస్ సాధించడంతో పాటు మంచి రేటింగ్ లను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆ సీరియళ్లలో కార్తీకదీపం సీరియల్ మాత్రం ప్రత్యేకమని చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాలు సైతం సాధించని స్థాయిలో కార్తీకదీపం సీరియల్ కు రేటింగ్స్ వచ్చేవంటే ఈ సీరియల్ రేంజ్ ఏమిటో సులువుగా అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో సాగదీస్తున్నారనే ఫీలింగ్ వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్ ను ఆదరిస్తూనే వచ్చారు. వంటలక్క, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 16, 2022 / 10:10 AM IST
    Follow us on

    KartheekaDeepam: బుల్లితెరపై ప్రసారమైన సీరియళ్లలో చాలా సీరియళ్లు సక్సెస్ సాధించడంతో పాటు మంచి రేటింగ్ లను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆ సీరియళ్లలో కార్తీకదీపం సీరియల్ మాత్రం ప్రత్యేకమని చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాలు సైతం సాధించని స్థాయిలో కార్తీకదీపం సీరియల్ కు రేటింగ్స్ వచ్చేవంటే ఈ సీరియల్ రేంజ్ ఏమిటో సులువుగా అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో సాగదీస్తున్నారనే ఫీలింగ్ వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్ ను ఆదరిస్తూనే వచ్చారు.

    వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రల్లో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, శోభాశెట్టి అద్భుతంగా నటించి ఆ సీరియల్ ఊహించని స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడానికి ఒక విధంగా కారణమయ్యారు. అయితే ఈ సీరియల్ డైరెక్టర్ ముఖ్య పాత్రలను ముగించి కొన్నిరోజుల క్రితం షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం హిమ, శౌర్య పాత్రలను సీరియల్ లో కీలకంగా మార్చిన దర్శకుడు మరికొన్ని కొత్త పాత్రలను సీరియల్ లో ప్రవేశపెట్టారు.

    అయితే ఆ ప్రభావం సీరియల్ రేటింగ్ పై పడింది. కొన్ని వారాల క్రితం వరకు అద్భుతమైన రేటింగ్స్ ను సొంతం చేసుకున్న కార్తీకదీపం సీరియల్ కు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో రేటింగ్స్ అయితే రావడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సీరియల్ కథ, కథనాలు ఒకింత గందరగోళంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 8వ తేదీన ప్రసారమైన కార్తీకదీపం ఎపిసోడ్ కేవలం 9.91 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. స్టార్ మా ఛానల్ లోనే ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి, దేవత సీరియళ్లు కార్తీకదీపంకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మెరుగైన రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్నాయి.

    రాబోయే రోజుల్లో కార్తీకదీపం సీరియల్ రేటింగ్ మరింత తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కార్తీకదీపం సీరియల్ మేకర్స్ ఈ సీరియల్ ను ముగించి మరో కొత్త కథతో కొత్త సీరియల్ ను మొదలుపెట్టి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కార్తీకదీపం నిర్మాతలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.