Bithiri Sathi: ఆ ప్రముఖ ఛానల్ కు కూడా దూరమైన బిత్తిరి సత్తి.. వాళ్లే పంపించేశారా?

Bithiri Sathi: టీవీ షోలు చూసే ప్రేక్షకులకు బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసలు పేరు కావలి రవికుమార్ అయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం బిత్తిరిసత్తిగానే ఇతను సుపరిచితమనే సంగతి తెలిసిందే. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన కామెడీ క్లబ్ అనే షో ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన బిత్తిరి సత్తి వీ6 ఛానల్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకున్నారు. తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ […]

Written By: Navya, Updated On : April 16, 2022 10:00 am
Follow us on

Bithiri Sathi: టీవీ షోలు చూసే ప్రేక్షకులకు బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసలు పేరు కావలి రవికుమార్ అయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం బిత్తిరిసత్తిగానే ఇతను సుపరిచితమనే సంగతి తెలిసిందే. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన కామెడీ క్లబ్ అనే షో ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన బిత్తిరి సత్తి వీ6 ఛానల్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకున్నారు.

తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒకవిధంగా బిత్తిరి సత్తి వల్లే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పినా అందులో ఆశ్చర్యం అవసరం లేదు. తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ వల్ల ఆ ఛానల్ రేటింగ్ కూడా ఊహించని స్థాయిలో పెరగడం గమనార్హం. ఆ తర్వాత టీవీ9 ఛానల్ లో ఇస్మార్ట్ న్యూస్ అనే ప్రోగ్రామ్ కోసం బిత్తిరి సత్తి పని చేశారు.

అయితే కొంతకాలం తర్వాత ఆ ఛానల్ కు కూడా దూరమైన బిత్తిరి సత్తి ఆ తర్వాత సాక్షి ఛానల్ లో చేరారు. సాక్షి ఛానల్ లో ప్రసారమైన గరం గరం వార్తలు అనే ప్రోగ్రామ్ కూడా బిత్తిరి సత్తికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే బిత్తిరి సత్తి తాజాగా సాక్షి ఛానల్ కు కూడా దూరమయ్యారు. అయితే ఛానల్ వాళ్లు సత్తిని పంపించలేదని అతనే ఛానల్ నుంచి బయటకు వచ్చారని సమాచారం అందుతోంది.

సినిమాలలో బిజీ కావాలనే ఆలోచనతో బిత్తిరి సత్తి సాక్షి ఛానల్ కు గుడ్ బై చెప్పారు. భాష, మ్యానరిజం మొనాటనీ అయిన నేపథ్యంలో సినిమాల్లో కొత్త తరహా పాత్రల ద్వారా ప్రూవ్ చేసుకోవాలని బిత్తిరి సత్తి భావిస్తున్నారు. మరి బిత్తిరి సత్తి కోరిక ఏ మేరకు నెరవేరుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బిత్తిరి సత్తి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.