https://oktelugu.com/

Star Heroine : ఫస్ట్ నైట్ రోజు స్నేహితులతో గడపమన్నాడు.. స్టార్ హీరోయిన్ సంచలన నిజాలు

Star Heroine ఇదిలా ఉంటే సినిమాల్లో నటిస్తున్న సమయంలో కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడింది. వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లికి ముందే వచ్చిన మనస్పర్థల వల్ల పెళ్లి ఆగిపోయిందట.

Written By:
  • S Reddy
  • , Updated On : July 3, 2024 / 09:48 PM IST

    Star heroine's marriage with a businessman. Husband who wanted to bid for friends

    Follow us on

    Star Heroine : సినిమా అంటే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో రాణించడం కష్టం. రాణించిన తర్వాత నిలబెట్టుకోవడం కష్టం. అన్ని బాగంటే ఆ తర్వాత లైఫ్ మాత్రం సూపర్ గా ఉంటుంది అనుకుంటారు కానీ కొందరి లైఫ్ మాత్రం అలా ఉండదు. సినీ లైఫ్ బాగున్నా పర్సనల్ లైఫ్ బాగుండకపోవచ్చు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ భర్త వల్ల చాలా ఇబ్బందులు పడిందట. ఇంతకీ ఆమె ఎవరు? భర్త ఏం చేశాడు అనే వివరాలు తెలుసుకుందాం.

    దశాబ్దాల పాటు ఇండస్ట్రీని శాసించింది కరిష్మా కపూర్. కానీ భర్త వల్ల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆయన నుంచి దూరం అయిన తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుందట. అయితే చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది ఈ హీరోయిన్. కానీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఈ కుటుంబం నుంచి నిర్మాతలు, దర్శకులు, హీరోహీరోయిన్ లుగా రాణించారు. ఆ ఫ్యామిలీ నుంచే 1991లో వచ్చిన కరిష్మా హిట్ సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించింది.

    సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది ఈ అమ్మడు. ఇక రీఎంట్రీ ఇస్తున్న ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా తన పెళ్లి జీవితం గురించి తెలిపింది. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు దేశంలో పెద్ద వ్యాపారవేత్త అయినా సంజయ్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించలేదు. వారి మధ్య జరిగిన గొడవల వల్ల 2016లోనే విడాకులు తీసుకుందట కరిష్మా. వీరి విడాకుల తర్వాత ఆమె చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి.

    పెళ్లైన తొలిరాత్రే భర్త సంజయ్ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడట. పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్లిన సమయంలో అతని స్నేహితులతో రాత్రి గడపాలి అని ఒత్తిడి చేశాడట. అంతేకాదు ఏకంగా డబ్బు కోసం వేలం వేయడానికి సిద్దమయ్యాడని తెలిపింది కరిష్మా. తల్లితో కొట్టించాలని చూశాడట. మొత్తం మీద విడాకుల తర్వాత ఈమెకు సంజయ్ కపూర్ విలాసవంతమైన ఇల్లు, రూ. 14 కోట్ల భరణం ఇచ్చారని అప్పట్లో టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే సినిమాల్లో నటిస్తున్న సమయంలో కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడింది. వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లికి ముందే వచ్చిన మనస్పర్థల వల్ల పెళ్లి ఆగిపోయిందట.