Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : సినిమాలు చేయడంపై సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : సినిమాలు చేయడంపై సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తనదైన రీతిలో సేవలను అందిస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని ఫైల్స్ ని తిరిగేసి చూస్తున్న పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం పేద ప్రజలకు ఎలాంటి అభివృద్ధికరమైన పనులను చేయలేదని ఆయన ఇప్పుడు ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లోకి తీసుకు రావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే కాకినాడ జిల్లాలోని ఉప్పాడ లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఓజీ ఓజీ అంటూ అరిచారు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఇప్పుడు మనకు సినిమాలు చేసే టైం ఉందంటారా? అంటూనే నిన్ను ఎన్నుకున్నందుకు కనీసం రోడ్లపై ఉన్న గుంతలు కూడా పూడ్చలేదు కదా అని జనం తిడతారు..

మనం ఓజీ అంటే వాళ్ళు క్యాజీ అంటారు.నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటూనే అవకాశం దొరికినప్పుడు ఓ రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్ చేస్తానని ప్రొడ్యూసర్స్ కి చెప్పానని అలాగే ఓజీ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని ఆ సినిమా చూడండని చెప్పాడు. ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఇక మీదట కూడా తను సినిమాలు చేయబోతున్నాడు అనే దానిమీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ఎలక్షన్స్ లో గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తం అయ్యాయి.

ఇక దానికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చిన సమాధానంతో ఆయన అభిమానులందరూ ఖుషి గా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇకమీదట సినిమాలు చేయడేమో అనే నిరుత్సాహానికి గురవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఇదొక ఊరట నిచ్చే అంశమనే చెప్పాలి. ఇక తొందర్లోనే ఆయన సినిమా షూటింగ్ ల్లో కూడా పాల్గొని సెట్స్ మీద ఉన్న సినిమాలను తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇక మీదట రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version